ధోనీపై నిషేధం?.. ఫైనల్ మ్యాచ్​కు అనుమానమే! ఆ పని చేయడం వల్లే ఇలా..

author img

By

Published : May 24, 2023, 1:28 PM IST

ms dhoni ban

ఐపీఎల్​ సీజన్​లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్​లో ధోనీ సేన ఫైనల్స్​కు చేరుకుంది. అయితే ఈ సంబరాల్లో ఉన్న చెన్నై టీమ్​కు ఓ గట్టి షాక్​ తగిలే అవకాశాలు ఉన్నాయట. ఇంతకీ ఏమైందంటే..

ఐపీఎల్​లో సీజన్​ 16లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ 10వ సారి ఐపీఎల్ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. మే 28న జరగనున్న ఫైనల్స్​లో ఆడనుంది. మే 23న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్​లో.. గుజరాత్ టైటాన్స్​పై అనూహ్యంగా గెలిచింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ 157 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 పరుగుల తేడాతో చెన్నై టీమ్ గెలుపును ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్​లో జరిగిన ఓ ఘటన వల్ల ఇప్పుడు ధోనీ బ్యాన్​ అయ్యే ప్రమాదం ఉందట. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇన్నింగ్స్ చివరి దశలో మతీశా పతిరాణాను బౌలింగ్ వేయడానికి అంపైర్లు అంగీకరించలేదు. బౌలింగ్ చేయడానికి బంతిని అందుకున్న ఈ శ్రీలంక బౌలర్‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి మూకుమ్మడిగా ఆపారు. అతడు తొమ్మిది నిమిషాల పాటు గ్రౌండ్‌లో లేడు. విశ్రాంతి తీసుకుని.. బౌలింగ్ చేసేందుకు రావడమే దీనికి కారణమైంది. అందుకు ఆగ్రహించిన ధోనీ ఈ విషయంపై అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దాదుపు ఐదు నిమిషాల పాటు అంపైర్లతో ధోనీ చర్చలు జరిగాయి.

అయితే కావాలనే.. ధోనీ ఇలా అంపైర్ల విలువైన సమయాన్ని వృథా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సైతం ఆరా తీస్తోందని సమాచారం. అయితే ఒకవేళ ధోనీ నిజంగా ఈ తప్పు చేసినట్టుగా తేలితే అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని టాక్​. అయితే ఆ మ్యాచ్​ ఆ మ్యాచ్ ఫైనల్ కానుంది.

అయితే బౌలర్ మాత్రం విశ్రాంతి తీసుకుని వచ్చినట్టుగా సమాచారం. ఐపీఎల్ నియమావళిలోని 14.2.3 నిబంధన ప్రకారం.. ఓ ప్లేయర్ మ్యాచ్ జరిగే సమయంలో ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో లేకపోతే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం అంపైర్లకు ఉంది. అంత సేపు.. అతడు మ్యాచ్​లో అందుబాటులో లేకుంటే..తను ఇక మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు వీలుండదు. ఇదే విషయాన్ని అంపైర్లు వివరించినట్టుగా తెలుస్తోంది. అందుకనే మతీశాను.. అంపైర్లు బౌలింగ్​ను అంగీకరించలేదు. దీంతో ధోనీ వచ్చి మాట్లాడాల్సి వచ్చింది.

ఇక ఇదే విషయంపై కామెంటర్స్ సునీల్ గవాస్కర్, సైమన్ డౌల్ ప్రస్తావించారు. అంపైర్లతో ఐదు నిమిషాలపాటు వాదనలకు దిగడం ఏ మాత్రం మంచిది కాదంటూ అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో మతీశా ప్లేసులో మరో బౌలర్​ను బౌలింగ్ చేయనివ్వకుండా ధోనీ అడ్డుకున్నట్టయిందని పేర్కొన్నారు. దీనికోసం తగిన మూల్యాన్ని చెల్లించే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.