ETV Bharat / sports

IPL 2022: బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్​గా..

author img

By

Published : May 22, 2022, 5:43 PM IST

IPL 2022: ఐపీఎల్​లో అరుదైన రికార్డు నెలకొల్పాడు ముంబయి ఇండియన్స్ స్టార్ పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా. వరుసగా ఏడో సీజన్​లో 15 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్​గా నిలిచాడు.

Jasprit Bumrah
IPL 2022

IPL 2022: శనివారం దిల్లీ క్యాపిటల్స్​పై విజయంతో ఐపీఎల్​ 2022లో తన ప్రస్థానాన్ని ముగించింది ముంబయి ఇండియన్స్. ఇది ఆ జట్టుకు నాలుగో విజయం కాగా, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబయి ప్లేఆఫ్స్​కు చేరుకోకపోవడం ఇది వరుసగా రెండో ఏడాది. అయితే ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచిన ఆ జట్టుకు ఈ ఏడాది అంతగా కలిసిరాకున్నా.. వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా సంతోషించగలిగే ఓ విషయం ఉంది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును సాధించాడు.

వరుసగా ఏడో సీజన్​లో 15 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్​గా నిలిచాడు బుమ్రా. అతడి కన్నా ముందు కేవలం శ్రీలంక పేస్ ఐకాన్ లసిత్ మలింగ మాత్రమే ఈ ఘనత అందుకున్నాడు. దిల్లీతో మ్యాచ్​లో 3 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. మొత్తంగా ఈ సీజన్​లో 14 మ్యాచ్​ల్లో 7.18 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. మరోవైపు డేనియల్ సామ్స్​ కూడా 11 మ్యాచ్​ల్లో 13 వికెట్లతో రాణించాడు.

ఇదీ చూడండి: ముంబయి విజయంతో ఆర్సీబీలో ఫుల్​జోష్​.. చిందులేస్తూ సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.