ETV Bharat / sports

IPL 2022: అసిస్టెంట్​ కోచ్​గా షేన్​ వాట్సన్​.. ఏ జట్టుకంటే?

author img

By

Published : Mar 15, 2022, 3:59 PM IST

IPL 2022: ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​ ఆడిన షేన్​ వాట్సన్.. కొచ్​గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్​ 2022 కోసం.. దిల్లీ క్యాపిటల్స్​ తమ సహాయక కోచ్​గా అతడిని నియమించింది. ఈ మేరకు జట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటన చేసింది.

Shane Watson
షేన్​ వాట్సన్

IPL 2022: ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ షేన్​ వాట్సన్​ను సహాయక కోచ్​గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ మేరకు.. "ఐపీఎల్​ లెజెండ్​, టీ20 అత్యుత్తమ ఆల్​రౌండర్​కు స్వాగతం" అంటూ మంగళవారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం దిల్లీ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రిక్కీ పాంటింగ్​ ప్రధాన కోచ్​గా ఉన్నాడు. ప్రవీన్​ ఆమ్రే, అగార్కర్​ సహాయ కోచ్​లుగా.. జేమ్స్​ హోప్స్​ బౌలింగ్​ కోచ్​గా వ్యవహరిస్తున్నారు. తన నియామకం పట్ల వాట్సన్​ హర్షం వ్యక్తంచేశాడు.

"ఐపీఎల్..​ ప్రపంచంలోనే ఉత్తమ టీ20 టోర్నమెంట్​. ఇందులో ఆటగాడిగా నాకు అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. 2008 తొలి ఐపీఎల్ గెలిచిన రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో సభ్యుడిగా.. షేన్​ వార్న్​ నాయకత్వంలో ఆడాను. ఆ తర్వాత ఆర్​సీబీ, చెన్నై జట్లకు ఆడాను. ప్రస్తుతం కోచ్​గా దిగ్గజ ఆటగాడు రిక్కీ పాంటింగ్ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం వచ్చింది. అతడు అద్భుతమైన నాయకుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కోచ్​లలో ఒకడు. అతడి సారథ్యంలో పనిచేసేందుకు సంతోషిస్తున్నాను."

-షేన్​ వాట్సన్, ఆసీస్ మాజీ క్రికెటర్

బలమైన జట్టుతో బరిలోకి..

ఈ సీజన్​లో దిల్లీకి రిషభ్​ పంత్​ సారథ్యం వహించనున్నాడు. అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. జట్టులో డేవిడ్​ వార్నర్​, పృథ్వీ షా, రోవ్​మన్ పొవెల్, మిషెల్​ మార్ష్​ వంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్​ విభాగంలో అక్షర్ పటేల్, శార్దూల్​ ఠాకూర్​, అన్రిచ్ నోర్జ్​ వంటి వారితో జట్టు పటిష్ఠంగా కనబడుతోంది.

ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్​లో 'మెయిడిన్ మాస్టర్స్​​' వీళ్లే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.