ETV Bharat / sports

ICC World Cup Team India Jersey : ప్రపంచకప్​నకు టీమ్ఇండియా జెర్సీ రెడీ.. అందులో అదే స్పెషల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 6:24 PM IST

ICC World Cup Team India Jersey : భారత్ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమ్‌ఇండియా జెర్సీని అఫీషియల్ జెర్సీ స్పాన్సర్‌ అడీడాస్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్‌ ఈ కొత్త జెర్సీలను ధరించి కనిపించారు.

ICC World Cup Team India Jersey
ICC World Cup Team India Jersey

ICC World Cup Team India Jersey : రానున్న ప్రపంచ కప్​ దృష్యా టీమ్ఇండియాకు సంబంధించిన కొత్త జెర్సీనీ విడుదల చేసింది బీసీసీఐ. ఈ క్రమంలో మన ప్లేయర్లు తాజాగా కొత్త జెర్సీలను ధరించి ఓ వీడియోను విడుదల చేశారు. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్‌ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్‌ బ్లూ కలర్‌ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్‌ కలర్‌ జెర్సీలను అడిడాస్‌ రూపొందించింది.

జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్‌) లోగోను, ఎడమవైపు టీమ్‌ లోగో, ఆ తర్వాత దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌ 11 పేరు, దాని కింద ఇండియా అని రాసుంది, జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. ఇక వరల్డ్‌కప్‌ నేపథ్యంలో అడిడాస్‌ కంపెనీ.. కొత్త జెర్సీలో కొన్ని మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో ఇండియన్​ ఫ్లాగ్​లోని మూడు రంగులను ప్రింట్​ చేసింది. అలాగే టీమ్‌ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా రూపొందించింది. అయితే ఈ రెండు స్టార్లు.. భారత్ ఇదివరకు గెలిచిన వన్డే (1983, 2011) ప్రపంచకప్​లకు గుర్తుగా ఉంచారని తెలుస్తోంది.

ఇక టీమిండియా కొత్త జెర్సీని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జెర్సీతో తీసిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్‌ఫుల్‌గా ఉందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

అయితే అడిడాస్ స్పోర్ట్స్​ బ్రాండ్.. ఈ ఏడాది మే నెలలో బీసీసీఐతో ఐదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2023 జూన్ నుంచి 2028 వరకు అమలలో ఉండనుంది. ఈ ఐదు సంవత్సరాల కాలానికిగాను రూ.350 కోట్లకు డీల్ కుదిరింది. ఇక జూన్​లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ మ్యాచ్​ నుంచే అడిడాడ్ స్పాన్సర్​షిప్ అధికారికంగా అమలులోకి వచ్చింది.

ICC On World Cup Pitch : వరల్డ్​ కప్​ పిచ్​లపై ఐసీసీ స్పెషల్ ఫోకస్​.. అలా తయారు చేయాలంటూ ఇన్స్‌స్ట్ర‌క్ష‌న్స్!

ICC World Cup Anthem 2023 : వరల్డ్​ కప్​ యాంథమ్​ వచ్చేసిందోచ్​.. ఇక అందరూ అంటారు 'దిల్ జషన్ బోలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.