ETV Bharat / sports

Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 2:59 PM IST

Updated : Sep 4, 2023, 3:17 PM IST

Asia Cup 2023 India VS Nepal : ఆసియా కప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా జరగనున్న మ్యాచ్​లో భారత్, నేపాల్ తలపడనున్నాయి.టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.

Asia Cup 2023  : నేపాల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే
Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే

Asia Cup 2023 India VS Nepal : ఆసియా కప్‌లో భాగంగా మరికాసేపట్లో పల్లెకెలె వేదికగా భారత్, నేపాల్ తలపడనున్నాయి.టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, టీమ్​ఇండియా- నేపాల్ మధ్య ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం.

ఈ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. "బౌలింగ్‌ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. గత మ్యాచ్‌లో మంచి స్కోరు సాధించేందుకు మేము పోరాడాల్సి వచ్చింది. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌.. అద్బుతంగా రాణించారు. ఈ సారి బౌలర్లకు ఛాన్స్​ ఇవ్వాలని భావించాం" అని అన్నాడు

నేపాల్‌తో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. "వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. బుమ్రా ఈ రోజు అందుబాటులో లేడు. కాబట్టి షమీ అతడి స్థానంలో బరిలోకి దిగుతాడు" అని రోహిత్‌ శర్మ తెలిపాడు. నేపాల్‌ కెప్టెన్ రోహిత్‌ పౌడేల్‌ ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. ఆరిఫ్‌ షేక్‌ స్థానంలో భీమ్‌ షర్కీని తుది జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

నేపాల్‌ తుది జట్టు : రోహిత్‌ పౌడెల్‌ (కెప్టెన్‌), కుశాల్‌ బర్టెల్‌, అసిఫ్‌ షేక్‌, భీమ్‌ షార్కి, సోమ్‌పాల్‌, దీపేంద్ర సింగ్‌, గుల్షాన్‌ జా, కుశాల్‌ మల్లా, కరణ్‌, సందీప్‌ లమిచానె, లలిత్‌ రాజ్‌బాన్షీ

భారత్ తుది జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్‌, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌.

India VS Nepal : ఓడితే ఇంటికే.. గ్రూప్‌-ఏలో ఉన్న నేపాల్‌ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్​తో తలపడిన సంగతి తెలిసిందే. ముల్తాన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బలమైన టీమ్​ఇండియాతో రెండో మ్యాచ్‌ ఆడుతోంది. ఈ పోరులో కనుక ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే.

  • The first ever ODI between Nepal and Pakistan is set to be a memorable clash, especially for the Nepalese cricket team. A proud moment for them to make their Asia Cup debut against one of the most prominent teams in world cricket. 👏#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/BXXX16EYxP

    — AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?

Asia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీAsia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీ

Last Updated : Sep 4, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.