ETV Bharat / sitara

'బిగ్​బాస్' ఓటీటీ.. అప్పటినుంచే స్ట్రీమింగ్?

author img

By

Published : Feb 4, 2022, 10:22 PM IST

Bigg boss OTT: గత ఐదు సీజన్లు టీవీ ప్రేక్షకుల్ని అలరించిన 'బిగ్​బాస్'.. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్​కు సిద్ధమైంది. ఈనెల చివరి నుంచి ప్రసారం కానుందని సమాచారం.

bigg boss ott telugu
నాగార్జున బిగ్​బాస్ ఓటీటీ

Bigg boss nagarjuna: బుల్లితెర ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'. ఐదు సీజన్లతో విశేషంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమం.. ఇకపై ఓటీటీ వేదికగానూ అలరించనుంది. ఈ విషయాన్ని ఓటీటీ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌' యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున గతేడాదే ప్రకటించారు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోకి సంబంధించి కొన్ని అప్‌డేట్స్‌ టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

bigg boss ott telugu nagarjuna
నాగార్జున

ఫిబ్రవరి రెండో వారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదలకానున్నాయట. కార్యక్రమానికి ఎంపికైన కంటెస్టెంట్లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటారని, ఈ నెల 27 నుంచి షో ప్రసారమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

'బిగ్‌బాస్‌' గత సీజన్లలో పాల్గొన్న ముమైత్‌ఖాన్‌, ఆదర్శ్, తనీష్, ధన్‌రాజ్‌ తదితరులతోపాటు పలువురు కొత్తవారు ఓటీటీ బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. 'బిగ్‌బాస్‌ బజ్‌' హోస్ట్‌గా ఆర్జే కాజల్‌ వ్యవహరించనుందట. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.