ETV Bharat / sitara

బిగ్​బాస్​లో 'ఆర్ఆర్ఆర్' బృందం.. ఎన్టీఆర్​-చెర్రీలతో సల్మాన్​ స్టెప్పులు

author img

By

Published : Dec 25, 2021, 1:33 PM IST

RRR movie Bigboss: 'ఆర్​ఆర్​ఆర్'​లోని 'నాటు నాటు' పాటకు ఎన్టీఆర్​-చరణ్​లతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్ ఖాన్​. సినిమా ప్రమోషన్​లో భాగంగా 'బిగ్​బాస్​' షోకు వెళ్లిన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం సల్మాన్​తో కలిసి సందడి చేసింది.

RRR movie
ఆర్​ఆర్​ఆర్

RRR movie Bigboss: 'ఆర్ఆర్ఆర్'.. థియేటర్లలోకి రావడానికి మరో రెండు వారాల సమయముంది. మరోవైపు సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుల మనసులో ఆత్రుతగా ఉంది. ఈ నేపథ్యంలోనే నేషనల్​ వైడ్​ ప్రచారంలో బిజీగా ఉంది చిత్రబృందం. అందులో భాగంగా హిందీలో సల్మాన్​ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్​బాస్​' షోకు అతిథులుగా వెళ్లారు ఎన్టీఆర్​, రామ్ చరణ్, ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి.

RRR movie
'బిగ్​బాస్'​ షోలో 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్

'బిగ్​బాస్'​ వేదికపై 'నాటు నాటు' (హిందీలో 'నాచో నాచో') పాటకు మూవీ టీమ్​తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. ఈ కార్యక్రమం శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది.

అంతకుముందు 'కపిల్​ శర్మ' షోలోనూ సందడి చేసింది 'ఆర్​ఆర్ఆర్'​ చిత్రబృందం. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే ప్రసారం కానుంది.

RRR movie
'ది కపిల్​ శర్మ'షో 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రబృందం

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

RRR movie
'ఆర్​ఆర్​ఆర్'​

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్'లోని భీమ్ సాంగ్.. రూ.200 కోట్ల దాటిన 'పుష్ప' వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.