ETV Bharat / sitara

'ఆకాశవాణి' ట్రైలర్​.. 'దృశ్యం 2' సెన్సార్​ పూర్తి

author img

By

Published : Sep 20, 2021, 5:20 PM IST

Updated : Sep 20, 2021, 8:33 PM IST

మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో 'దృశ్యం 2', 'రష్మీరాకెట్'​, 'మహాసముద్రం', 'ఆకాశవాణి', 'రాజావిక్రమార్క' సహా పలు చిత్రాల వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

updates
అప్డేట్స్​

'తప్పడ్‌', 'హసీనా దిల్‌రుబా', 'అనబెల్‌ సేతుపతి'.. ఇలా వరుస ఓటీటీ రిలీజ్‌లతో దూసుకెళ్తున్నారు నటి తాప్సీ పన్ను. తాజాగా 'రష్మీరాకెట్‌'తో(rashmi rocket release date) ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ పాత్రలో కనిపించనున్నారు. ఆకర్ష్‌ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

rashmi rocket
రిలీజ్​ డేట్​తో రష్మీ రాకెట్​

'ఆకాశవాణి' ట్రైలర్​

నటుడు సముద్రఖని(Samuthirakani Aakashavaani) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆకాశవాణి'(aakashavani movie trailer). అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించారు. రెట్రో కథతో తీసిన ఈ సినిమాను నేరుగా సెప్టెంబరు 24న సోనీ లివ్​లో(Sonyliv) రిలీజ్​ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు హీరో ప్రభాస్​. ఆద్యంతం ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సెన్సార్​ పూర్తి

వెంకటేశ్ నటిస్తున్న కొత్త సినిమాల్లో మలయళ హిట్​ 'దృశ్యం 2' రీమేక్​(drishyam 2 censor certificate) ఒకటి. తాజాగా ఈ చిత్రం సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. 'యూ' సర్టిఫికేట్​ను దక్కించుకుంది. ఒరిజినల్​ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో పాటు వెంకీ 'ఎఫ్​ 3'లోనూ(f3 venkatesh movie) నటిస్తున్నారు.

drishyam 2
దృశ్యం 2 సెన్సార్​ పూర్తి

ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్​

శర్వానంద్‌, సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మహాసముద్రం'(mahasamudram trailer). ఈ చిత్ర థియేట్రికల్​ ట్రైలర్​ను సెప్టెంబరు 23న రిలీజ్(mahasamudram release date)​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు.

mahasamudram
మహాసముద్రం

ఫస్ట్​ సింగిల్​

యువ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త సినిమా 'రాజావిక్రమార్క'(karthikeya raja vikramarka). ఈ చిత్రంలోని ఫస్ట్​ సింగిల్​ను సెప్టెంబరు 21 సాయంత్రం 4.49గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

rajavikramarka
రాజావిక్రమార్క

సాంగ్​ రిలీజ్​

తమిళ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం 'ఎనిమీ'(vishal enemy song). సోమవారం(సెప్టెంబరు 21) ఈ సినిమాలోని లిటిల్​ ఇండియా సాంగ్​ను విడదలై ఆకట్టుకంటోంది. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
sumanth
అనగనగా ఒక రౌడీ
chiyan vikram
చియాన్​ విక్రమ్​ 'మహాన్​'


ఇదీ చూడండి: Samantha akkineni News: ఆ హీరోయిన్లతో సమంత పార్టీ

Last Updated : Sep 20, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.