క్యాబ్​లో వచ్చి బ్యాంక్​ దోపిడీ.. తిరిగి అదే కార్​లో ఇంటికెళ్లిన దొంగ.. డ్రైవర్​కు మాత్రం..

author img

By

Published : Nov 22, 2022, 6:36 AM IST

Bank Robbery In Michigan
బ్యాంక్ దోపిడీ ()

Bank Robbery In Michigan : అమెరికాలోని మిచిగాన్‌లో బ్యాంకు దోపిడీ జరిగింది. నిందితుడు ఉబర్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకొని, డ్రైవర్‌ను బ్యాంకు బయట వేచి ఉండమని చెప్పి దోపిడీకి పాల్పడ్డాడు. అయితే ఈ తతంగమంతా క్యాబ్‌ డ్రైవర్‌కు తెలియక పోవడం గమనార్హం.

Bank Robbery In Michigan : సాధారణంగా దోపిడీకి పాల్పడే దొంగలు తప్పించునేందుకు వీలుగా వాహనాల నెంబర్‌ప్లేట్లకు స్టిక్కర్లు అంటిస్తారు. దోపిడీ సమయంలో కొందరు నెంబర్‌ ప్లేట్లనే పీకేస్తారు. కానీ, అమెరికాలో బ్యాంకును లూటీ చేసిన ఓ 'దొంగ' ఆలోచన ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. దుండగుడు బ్యాంకును దోపిడీ చేసేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉబర్‌ యాప్‌లో కారు బుక్‌ చేసుకొని, బ్యాంకు వరకు వెళ్లిన తర్వాత అక్కడే వేచి ఉండమని కారు డ్రైవర్‌కు చెప్పి పని పూర్తయిన తర్వాత.. ఎంచక్కా ఠీవిగా అదే క్యాబ్‌ ఎక్కేసి వెళ్లిపోయాడు. వివరాలను సౌత్‌ఫీల్డ్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన జేసన్‌ క్రిస్టమస్‌ అనే వ్యక్తి సౌత్‌ఫీల్డ్‌లోని హంటిగ్టన్‌ బ్యాంకు దోపిడీకి ప్రణాళిక వేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉబర్‌ యాప్‌లో కారు బుక్‌ చేసుకొని హంటింగ్టన్‌ బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. డ్రైవర్‌ను అక్కడే ఉండమని చెప్పి, ముఖానికి మాస్క్‌ పెట్టుకొని లోపలికి వెళ్లాడు. సెక్యూరిటీ గార్డుకి పాయింట్‌ బ్లాక్‌లో గన్‌ పెట్టి బెదిరించి డబ్బు దోచుకొని, కారెక్కి పారిపోయాడు. అయితే బ్యాంకులో జరిగిన తతంగమంతా కారు డ్రైవర్‌కు తెలియకపోవడం గమనార్హం.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు పారిపోయిన కారు నెంబరు ప్లేటును గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.నెంబర్‌ ప్లేటు ఆధారంగా డ్రైవన్‌ను గుర్తించి ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని సమాధానం చెప్పాడు. దోపిడీతో అతడికి సంబంధం లేదని నిర్ధరించుకున్న తర్వాత ఉబర్‌ డేటా ఆధారంగా పోలీసులు క్రిస్టమస్‌ చిరునామాను గుర్తించారు. అతడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.