ETV Bharat / international

ఖలిస్థానీ మద్దతుదారుల విధ్వంసం.. మరో హిందూ దేవాలయంపై దాడి

author img

By

Published : Mar 4, 2023, 5:53 PM IST

ఆస్ట్రేలియాలోని మరో హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. బ్రిస్బేన్​లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు.

Khalistan supporters smash Shree Laxmi Narayan Temple in Brisbane
హిందూ దేవాలయంపై మరోసారి ఖలిస్తాన్ మద్దతుదారుల విధ్వంసం

ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో ప్రఖ్యాత హిందూ ఆలయంపై దాడి చేశారు. శ్రీలక్ష్మీనారాయణ ఆలయ గోడలను ధ్వంసం చేశారు. భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. 'సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్​ఎఫ్​జే) అనే సంస్థ ఆలయంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న హిందువులను భయపెట్టడానికి ఈ సంస్థ చాలా ప్రయత్నిస్తోంది. వివిధ మార్గాల్లో హిందూ వ్యతిరేక ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.' అని ఆలయ ప్రెసిడెంట్ సతీందర్ శుక్లా తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

ఒక్క జనవరిలోనే మూడు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు ఖలిస్థానీ మద్దతుదారులు. జనవరి 23న మెల్​బోర్న్​లోని ఇస్కాన్​ ఆలయం గోడలపై వ్యతిరేక నినాదాలు చేశారు. జనవరి 16న ఆస్ట్రేలియాలోని క్యారమ్ డౌన్స్‌లోని శ్రీ శివవిష్ణు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ గోడలపై విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు రాశారు. జనవరి 12న, ఆస్ట్రేలియాలోని మిల్ పార్క్‌లోని స్వామినారాయణ్​ఆలయాన్ని ధ్వంసం చేశారు. భారత్​, హిందూ వ్యతిరేక నినాదాలు గోడలపై రాశారు.

ఆస్ట్రేలియాలోని తమ కాన్సులేట్ జనరల్ స్థానిక పోలీసులతో మాట్లాడి సమాచారం తీసుకున్నారని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కెనడాలోని దేవాలయంపైనా..
అంతకుముందు కెనడా టొరంటోలోని స్వామినారాయణ్​ దేవాలయాన్ని ఖలిస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేశారు. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను భారత హైకమిషన్​ తీవ్రంగా ఖండించింది. "బీఏపీఎస్​ స్వామినారాయణ్ మందిరంపై కెనడియన్​ ఖలిస్థానీ తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కెనడియన్​ అధికారులకు నివేదించాం" అని హైకమిషన్​ ట్విట్టర్​ ద్వారా తెలిపింది. ఈ చర్యను భారత హైకమిషన్​ తీవ్రంగా ఖండిస్తూ, దోషులపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

పాకిస్థాన్​లోని ఆలయంపైనా దాడి
పాకిస్థాన్​లో ఓ హిందూ దేవాలయం దుండగుల దాడికి గురైంది. కరాచీ కోరంగి ప్రాంతంలోని శ్రీ మరీ మాతా మందిర్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఆరు లేదా ఎనిమిది మంది దుండగులు ద్విచక్రవాహనాలపైన వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.