ETV Bharat / international

Afghanistan news: చైనాకు.. అనుకోని వరం ఆ రహదారి..

author img

By

Published : Aug 21, 2021, 9:26 AM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు చేజిక్కించున్న క్రమంలో చైనా భారీగా లాభపడే అవకాశం ఉంది. అఫ్గాన్‌ సరిహద్దు ప్రావిన్స్‌ బదక్షాన్‌లోని నజాక్‌ ప్రాంతంలో ఇరుదేశాలను కలుపుతూ.. 50 కిలోమీటర్ల రహదారి సిద్ధమవుతోంది. ఇప్పటికే.. అఫ్గానిస్థాన్‌లో దొరికే అరుదైన 'రేర్‌ఎర్త్‌' ఖనిజాలపై కన్నేసిన చైనాకు ఈ రహదారి నిర్మాణం అనుకోని వరంలా మారింది.

Taliban
తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవటం చైనాకు కలిసొచ్చేలానే ఉంది. ఇప్పటికే ఆ దేశంలో అరుదైన ఖనిజసంపదపై కన్నేసిన డ్రాగన్‌.. త్వరలో వాటిని అత్యంత సులభంగా తన దేశంలోకి తరలించుకు పోవచ్చు! ఇందుకు వీలుగా అఫ్గాన్‌ సరిహద్దు ప్రావిన్స్‌ బదక్షాన్‌లోని నజాక్‌ ప్రాంతంలో 50 కిలోమీటర్ల రహదారి సిద్ధమవుతోంది. దీని నిర్మాణాన్ని 2020లో అష్రఫ్​ ఘనీ ప్రభుత్వం ప్రారంభించటం విశేషం. ఇప్పటికే 20 శాతం పని పూర్తయింది. మిగిలిన 80 శాతం పూర్తయితే బదక్షాన్‌ నుంచి చైనాలోని షింజియాంగ్‌ ప్రావిన్స్‌కు రాకపోకలు సులభమవుతాయి.

అఫ్గానిస్థాన్‌లో దొరికే అరుదైన 'రేర్‌ఎర్త్‌' ఖనిజాలపై కన్నేసిన చైనాకు ఈ రహదారి వరం కానుంది. కంప్యూటర్లు, రీఛార్జబుల్‌ బ్యాటరీలు, పవన్​​ విద్యుత్‌, టర్బయిన్లు, హైబ్రీడ్‌ కార్ల తయారీలో ఈ ఖనిజాలు చాలా కీలకం. ఈ విషయంలో ఇప్పటికే అఫ్గాన్‌తో చైనా కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంది.

త్వరలో తాలిబన్లు అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఈ రహదారి పూర్తయితే వాణిజ్యపరంగా చైనాకు మరింత లాభం చేకూరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Kabul news: 'కాబుల్​​ దృశ్యాలు.. ఆ హైజాక్​ ఘటనను తలపిస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.