ETV Bharat / bharat

Kabul news: 'కాబుల్​​ దృశ్యాలు.. ఆ హైజాక్​ ఘటనను తలపిస్తున్నాయి'

author img

By

Published : Aug 21, 2021, 5:04 AM IST

Updated : Aug 21, 2021, 8:39 AM IST

కాబుల్​ విమానాశ్రయంలోని (Kabul news) ప్రస్తుత పరిస్థితులు.. 'కాందహార్​ విమాన హైజాక్​ ఘటన'ను తలపిస్తున్నాయని కెప్టెన్ దేవీ శరణ్​ పేర్కొన్నారు. వేలాది మంది అఫ్గాన్(Afghanistan crisis) నుంచి బయటపడాలని చూస్తున్నారని చెప్పారు.

Kandahar horror in kabul airport
కెప్టెన్ దేవీ శరణ్, కాబుల్ విమానాశ్రయం​

కాబుల్ విమానాశ్రయంలోని(Kabul airport) ప్రస్తుత పరిస్థితులపై వస్తున్న దృశ్యాలు... 'కాందహార్ విమాన హైజాక్ ఘటన'ను తలపిస్తున్నాయని కెప్టెన్ దేవీ శరణ్ పేర్కొన్నారు. 1999 డిసెంబరు 24న కాఠ్​మాండూ నుంచి 179 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ (ఐసీ814) విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసి... తాలిబన్ల ఆధిపత్యంలోని కాందహార్​కు(Kabul news)​ తరలించారు. అప్పుడు ఆ విమాన కెప్టెన్​గా శరణ్ విధులు నిర్వర్తించారు. అఫ్గాన్​లోని తాజా పరిస్థితుల(Afghanistan crisis) నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

"రెండు దశాబ్దాలు గడిచినా, నేటికీ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాందహార్ నుంచి ఎలా బయటపడాలని మనం ఎదురుచూశామో... కాబుల్ విమానాశ్రయంలో(kabul afghanistan) ఇప్పుడు వేలమంది అదే ఆత్రుతతో ఉన్నారు. కాకపోతే అప్పుడు మనం మాత్రమే బాధితులం. ఇప్పుడు చాలా దేశాలవారు ఉన్నారు."

-కెప్టెన్ దేవీ శరణ్​, ఐసీ814 పైలట్​

"తాలిబన్లలో(taliban) రెండు రకాలవారు ఉంటారు. ఆయుధాలు పట్టుకునే వారు కబాలీలు. మరోరకం వారు కమెండోలు. కబాలీలు హైజాకర్లకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వారి డిమాండ్లను అంగీకరించేంత వరకూ విడిచిపెట్టరు" అని శరణ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ సమయంలో భారతీయులపై తాలిబన్ల కాల్పులు!

ఇదీ చూడండి: అఫ్గాన్​ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే!

Last Updated : Aug 21, 2021, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.