'రామారావు ఆన్ డ్యూటీ'లో వేణు.. పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా..

author img

By

Published : Jul 6, 2022, 10:45 PM IST

Venu Thottempudi character unveiled in Ramarao on Duty

రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటుడు వేణు లుక్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో అతను పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా అప్డేట్​ వచ్చేసింది. ఈ మూవీలో వేణు తొట్టెంపూడి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టు.. చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను నిజం చేస్తూ.. చిత్ర బృందం బుధవారం.. వేణు లుక్​ను పరిచయం చేస్తూ.. ఒక పోస్టర్​ను విడుదల చేశారు నిర్మాతలు. సీఐ మురళి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ఆయన శరత్ మండవ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు రవితేజ. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్​గా నటించబోతున్నారు. రవితేజ సరసన దివ్యంశ కౌశిక్, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

.
.

ఇదీ చదవండి: విశ్వక్​సేన్ కొత్త సినిమాకు స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​.. రణ్​బీర్​ 'షంషేరా' టీజర్​ అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.