విశ్వక్​సేన్ కొత్త సినిమాకు స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​.. రణ్​బీర్​ 'షంషేరా' టీజర్​ అదుర్స్​

author img

By

Published : Jun 22, 2022, 4:42 PM IST

Updated : Jun 22, 2022, 10:45 PM IST

Naga Chaitanya, Ranbir Kapoor, Vishwak Sen Updates on new movies

నాగ చైతన్య, రణ్​బీర్​ కపూర్​, విశ్వక్​సేన్ కొత్త సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్స్​ వచ్చేశాయి. అవేంటో చూద్దాం.

ఇటీవలే 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో హిట్​ అందుకున్న హీరో విశ్వక్​సేన్​ తన కొత్త సినిమా పనులను షురూ చేశారు. అయితే ఈ సినిమాతో విశ్వక్​సేన్.. జాక్​పాట్​ మీద జాక్​పాట్​ కొట్టేస్తున్నాడు. యాక్షన్​ కింగ్​గా సినీ ప్రియులకు సుపరిచితుడైన హీరో అర్జున్​.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఒక విశేషం అయితే.. ఆయన కూతురు ఇందులో హీరోయిన్​ కావడం గమనార్హం. తాజాగా ఈ సినిమాకు కేజీఎఫ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ రవి బస్రూర్​ సింగీతాన్ని అందిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

.
.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్​లో నాగ చైతన్య నటిస్తున్న సినిమా 'ఎన్​సీ22(వర్కింగ్​ టైటిల్​)'. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్​ను వెల్లడించింది చిత్రబృందం. నాగ చైతన్య 22వ సినిమాకు సంబంధిన కీలక ప్రకటన.. గురువారం ఉదయం 9:1 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్​లో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రవీణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

.
.

బాలీవుడ్‌ స్టార్​ హీరో రణ్‌బీర్ నటించిన చిత్రం 'షంషేరా'. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్‌ సీన్లతో ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్​ రణ్​బీర్​ కపూర్​ లుక్​ అదిరిపోయింది. ఈ సినిమాలో సంజయ్​దత్​ విలన్​గా కనిపించనున్నారు. జులై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను 'యశ్​ రాజ్​ ఫిల్మ్స్​' నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: 'కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధం'

Last Updated :Jun 22, 2022, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.