ETV Bharat / entertainment

Virupaksha Movie : వసూళ్లతో దూసుకెళ్తున్న 'విరూపాక్ష'.. ఇక ఆ మూడు భాషల్లోనూ!

author img

By

Published : Apr 29, 2023, 8:57 AM IST

టాలీవుడ్​లో ఇటీవలే రిలీజై బాక్సాఫీస్​ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సాయి ధరమ్​ తేజ్​ సినిమా విరూపాక్ష. రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్​ వచ్చింది. ఈ క్రమంలో సినిమాలో నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్​ను ప్రకటించింది మూవీ టీమ్​. అదేంటంటే..

sai dharam tej virupaksha movie
virupaksha movie

విభిన్న కథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని 'విరూపాక్ష' సినిమా మరోసారి రుజువు చేసింది. సుప్రీమ్​ స్టార్​ సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఏప్రిల్‌ 21 విడుదలై బాక్సాఫీస్​ వద్ద హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది. గడిచిన ఏడు రోజుల్లోనే సుమారు రూ.62.5 కోట్లు వసూళ్లు చేసి రికార్డుకెక్కింది. ఇప్పుడు ఈ చిత్రం దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్​ వచ్చింది. అదేందంటే.. ఇన్ని రోజులు తెలుగులో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీ, తమిళం అలానే మలయాళంలోనూ విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

"తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న 'విరూపాక్ష'.. ఇప్పుడు ఇతర భాషల్లోనూ సందడి చేయబోతోంది" అంటూ మూవీ టీమ్​ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. హిందీలో ఈ సినిమాను గోల్డ్‌మైన్స్‌ సంస్థ విడుదల చేయనుండగా.. తమిళంలో స్టూడియో గ్రీన్‌, మలయాళంలో E4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు.. తమ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపింది. అయితే రిలీజ్‌ డేట్‌ మాత్రం ఇంకా ప్రకటించలేదు. తొలుత 'విరూపాక్ష' సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. డబ్బింగ్‌ తదితర కార్యక్రమాలకు సమయం లేకపోవడం వల్ల తెలుగులోనే విడుదలైంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. సుకుమార్​ శిష్యుడైన కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి ధరమ్​ తేజ్​ సరసన సంయుక్త మీనన్ నటించారు. ఇక తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్.. ఈ సినిమాకు స్కీన్​ ప్లే అందించారు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

తొలి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'విరూపాక్ష'.. రెండు రోజుల్లో రూ.28 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయని టాక్. అంతే కాకుండా రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు మరింత పెరిగి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.44 కోట్ల మేర గ్రాస్ వసూలైందని మేకర్స్​ తెలిపారు. కాగా ఈ సినిమా అటు కలెక్షన్ల పరంగానూ ఇటు స్టోరీ పరంగానూ ఇండస్ట్రీలో మంచి టాక్​ను సంపాదించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.