ETV Bharat / entertainment

అభిమాని ఫోన్​ లాక్కొని విసిరేసిన రణ్​బీర్..

author img

By

Published : Jan 27, 2023, 4:44 PM IST

Updated : Jan 27, 2023, 6:42 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​ తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు. అతడి ఫోన్​ను లాక్కొని విసిరేశాడు. ఆ వివరాలు..

ranbir kapoor
ranbir kapoor

తాము అభిమానించే హీరో హీరోయిన్లు, నటీనటులు కనపడితే ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించడం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది స్టార్స్ కూడా అభిమానుల పట్ల దురుసుగా ప్రవరిస్తుంటారు. వారిపై అనవసరమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అలా విమర్శలకు గురౌతుంటారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. బాలీవుడ్ హీరో​ రణ్​బీర్ కపూర్​ ఒక అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారు. అభిమాని చర్య వల్ల విసుగు చెందారో లేదా పబ్లిసిటీ స్టంట్​లో భాగంగా అలా చేశారో తెలియదు కానీ.. ఆయన చేసిన ఓ పని మాత్రం సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ ఫ్యాన్​ మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని విసిరేశారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు ఓ ప్లేస్​లో రణ్​బీర్​ ఉండగా.. ఆయనతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. అయితే మొదట బాగానే పోజు ఇచ్చిన రణ్​బీర్​ ఆ తర్వాత సహనం కోల్పోయాడు. ఎందుకంటే సదరు ఫ్యాన్స్​.. ఫొటో దిగే సమయంలో ఆ పిక్ సరిగ్గా వచ్చినట్టు లేదు. దీంతో అతడు రణ్​బీర్​ను వెళ్లనివ్వకుండా మళ్లీ సెల్ఫీ దిగేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలోనే రణ్​బీర్​.. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్‌ లాక్కొని విసిరేశాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కొంతమంది నెటిజన్లు రణ్​బీర్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. అలా చేయడం సరికాదని అంటున్నారు. అయితే ఇదంతా రణ్​బీర్​ నటిస్తున్న ఓ షూట్​లో భాగమని సినీ వర్గాల సమాచారం.

కాగా, రణ్​బీర్ ఇటీవలే​ 'బ్రహ్మాస్త్రం' చిత్రంతో సూపర్​ హిట్​ను అందుకున్నారు. ప్రస్తుతం రెండో భాగంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇటీవలే ఆయన.. హీరోయిన్​ శ్రద్ధా కపూర్​తో కలిసి నటించిన రొమాంటిక్‌ కామెడీ తూ ఝూఠీ.. మై మక్కార్‌ ట్రైలర్‌ విడుదలైంది. దర్శకుడు లవ్‌ రంజన్‌ తెరకెకిస్తోన్న ఈ సినిమా హోలీ పండగ సందర్భంగా మార్చి 8న విడుదలవుతోంది. ఆకట్టుకునే దృశ్యాలు, హీరోహీరోయిన్ల మధ్య సరదాగా నడిచే రొమాన్స్‌, నవ్వు తెప్పించే సంభాషణలతో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: మద్యానికి బానిసైన నన్ను ఆమెనే మార్చింది: రజనీకాంత్‌

Last Updated : Jan 27, 2023, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.