ETV Bharat / entertainment

దుమ్మురేపిన 'ఖుషి'​ వసూళ్లు.. రీరిలీజ్​ల్లో పవన్​ కల్యాణే టాప్​!

author img

By

Published : Jan 1, 2023, 6:01 PM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ నటించిన 'ఖుషి' రీరిలీజ్​ రికార్డులు బద్దలుగొడుతోంది. సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లైనా పవర్ ఏ​మాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ఖుషి' రీరిలీజ్​ కలెక్షన్లు ఎంతంటే?

kushi re release record collections
kushi re release record collections

వెండితెరపై ఆయన కనిపిస్తే ఈల వేసి గోల చేయాల్సిందే. సాధారణ కథానాయకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మాస్​ ఫ్యాన్​ బేస్​ను సంపాదించుకున్నారు. అశేష తెలుగు ప్రేక్షకులను ఆకర్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్నారు. పవర్​ స్టార్​ అయ్యారు. ఒక్క హిట్టు కూడా లేకుండా సుమారు నాలుగేళ్లు స్టార్​ ఇమేజ్​ కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఆయన​ క్రియేట్​ చేసిన రికార్డును మళ్లీ ఆయనే బద్దలుగొట్టారు.

kushi re release record collections
ఖుషి సినిమాలో పవన్ కల్యాణ్​

ఈ మధ్యకాలంలో టాలీవుడ్​లో రీరిలీజ్​ల ట్రెండ్​ నడుస్తోంది. అందులో పవర్​స్టార్​ రికార్డులు సృష్టిస్తున్నారు. పవర్​స్టార్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1న 'జల్సా'ను రీరిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.3.2 కోట్లు కలెక్ట్ చేసింది. డిసెంబరు 31న రీరిలీజైన.. 'ఖుషి' రూ.3.5 కోట్లకు పైగా కలెక్ట్​ చేసి.. 'జల్సా' రికార్డును బద్దలుగొట్టింది. అంతకుముందు రీరిలీజ్​ అయిన సూపర్​స్టార్ మహేశ్​ బాబు 'పోకిరి' సినిమా రూ.1.75 కోట్ల వసూళ్లతో మూడో స్థానంలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.