ETV Bharat / entertainment

మహేశ్​ ఫ్యాన్స్​కు ముందుగానే దీపావళి షురూ - గుంటూరు కారం 'దమ్​ మసాలా' సాంగ్​ ప్రోమో వచ్చేసిందోచ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 12:05 PM IST

Guntur Kaaram First Song Promo : సూపర్​ స్టార్​ మహేశ్​​ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ అప్డేట్​ వచ్చేసింది. ఆ వివరాలు..

మహేశ్​ ఫ్యాన్స్​కు ముందుగానే దీపావళి..  గుంటూరు కారం 'దమ్​ మసాలా' సాంగ్​ ప్రోమో వచ్చేసిందోచ్​
మహేశ్​ ఫ్యాన్స్​కు ముందుగానే దీపావళి.. గుంటూరు కారం 'దమ్​ మసాలా' సాంగ్​ ప్రోమో వచ్చేసిందోచ్​

Guntur Kaaram First Song Promo : సూపర్​ స్టార్​ మహేశ్​​ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ కాంబినేషన్​లో రానున్న మూడో చిత్రం 'గుంటూరు కారం'. ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ ప్రియులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్​ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్​ మాత్రం విడుదల చేయకుండా ఊరిస్తూ వచ్చి.. ఈ మధ్యే రిలీజ్​కు సన్నాహాలు చేశారు. కానీ అంతకన్నా ముందే లీకేజీ రాయుళ్లు ఆ సాంగ్ ఆడియో క్లిప్​ను లీక్​ చేసి మేకర్స్​కే షాక్ ఇచ్చారు. దీంతో ఏం చేయలేకపోయిన మూవీ మేకర్స్​.. తాజాగా సాంగ్​ ప్రోమోను విడుదల చేశారు.

'దమ్ మసాలా' పేరుతో సాగిన ఈ సాంగ్​.. 'ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తున్న చొక్కా పై గుండి' అంటూ ఈ పాట సాగిపోయింది. పూర్తి పాటను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రోమోను చూస్తుంటే ఈ సాంగ్​ మంచి బీట్​తో సాగింది. తమన్ దీనికి మ్యూజిక్ అందించారు. అభిమానులైతే.. రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. పూర్తి సాంగ్ కోసం ఫ్యాన్స్​ ఎక్సైటింగ్​గా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పాటను సంజిత్ హెగ్డే, తమన్ కలిసి ఆలపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సినిమాను వచ్చే ఏడాది జనవరి 12నే రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి గుర్తు చేశారు మేకర్స్​.

సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న సినిమా కావడంతో.. గుంటూరు కారం సంక్రాంతికి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. మహేశ్ ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు మేకర్స్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూరు కారం' సాంగ్ లీక్​ - పాపం తమన్​కే ఎందుకిలా?

Mahesh Babu Flop Movie : సినిమా ఫ్లాఫ్​ అయితే ఏం చేయాలో నాన్న దగ్గర నేర్చుకున్నాను! : మహేశ్​బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.