ఓవర్సీస్​లో బాలయ్య- వీరయ్య జోరు.. బాక్సాఫీస్​ వద్ద వసూళ్లు సంగతేెంటి?

author img

By

Published : Jan 19, 2023, 3:30 PM IST

sankranti movies box office collection

సంక్రాంతి బరిలో దిగిన అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఏ సినిమా ఎంత కలెక్ట్​ చేసిందంటే?

'అఖండ' తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ.. 'వీరసింహారెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలయ్య మార్క్​ యాక్షన్​ సీన్స్​తో పాటు సెంటిమెంట్​ ఈ సినిమాకు ప్లస్​ పాయింట్​గా నిలిచింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్​ ఆనందం అంతా ఇంతా కాదు. రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్​ వద్ద రూ.కోట్లు వసూలు చేసిన ఈ సినిమా బుధవారం సుమారు రూ.5.25 కోట్ల మేర రాబట్టిందని సమాచారం. మొత్తం కలెక్షన్లు రూ.100 కోట్లకుపైగా వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్​లోని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో మిలియన్ డాలర్ల దిశగా ఈ మూవీ దూసుకెళ్తోందని తాజా నివేదికలు వెల్లడించాయి.

జోరులో ఉన్న 'వీరయ్య'..
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవ‌ర్సీస్​లో వసూళ్ల పరంగా మెగాస్టార్​ చిరంజీవి 'వాల్తేర్‌ వీర‌య్య' దూసుకుపోతోంది. అమెరికాలో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రెండు మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరింది. ఓవ‌ర్సీస్​లో రెండు మిలియ‌న్ల మార్కును అందుకున్న చిరంజీవి మూడో సినిమాగా వాల్తేర్ వీర‌య్య రికార్డ్ క్రియేట్ చేసింది. తాజా నివేదికల ప్రకారం వాల్తేర్​ వీరయ్య విడుదలైన ఆరో రోజు రూ.9.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు వాల్తేర్ వీరయ్య మొత్తం బాక్సాఫీస్​ కలెక్షన్ రూ.109.60 కోట్లకు చేరుకుందని సమచారం..

వారసుడు వర్సెస్​ తెగింపు..
'వారసుడు'కి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు మంచి స్పందనే వస్తోంది. నైజాంలో రూ.35 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 13 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి రూ. 1.25 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వసూలైనట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకు 'వారసుడు' ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లు కలెక్ట్​ చేసినట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు తునివు కూడా సుమారు రూ.250 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్లు విషయంలో అదరగొట్టాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.