ETV Bharat / entertainment

రాజమౌళి, షారుక్‌ అరుదైన ఘనత.. ఇండస్ట్రీ నుంచి వీరిద్దరికే చోటు

author img

By

Published : Apr 14, 2023, 8:34 AM IST

Updated : Apr 14, 2023, 11:40 AM IST

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, షారుక్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించారు. అదేంటంటే?

Sharukh khan Rajamouli
రాజమౌళి, షారుక్‌ అరుదైన ఘనత.. ఇండస్ట్రీ నుంచి వీరిద్దరికే చోటు

'బాహుబలి 1', 'బాహుబలి 2'​, 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాలతో వరల్డ్​ వైడ్ ప్రత్యేక​ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ టాలీవుడ్​ డైరెక్టర్​, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అరదైన ఘనత సాధించారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ రిలీజ్​ చేసిన '100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023' జాబితాలో నిలిచారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తులు జాబితాలో చోటు దక్కించుకున్నారన్నమాట. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో యాక్ట్ చేసిన ప్రముఖ నటి ఆలియా భట్‌.. జక్కన్న గురించి టైమ్‌ మ్యాగజీన్‌ ప్రొఫైల్‌ కూడా రాశారు. ఇక ఈ లిస్ట్​లో రీసెంట్​గా 'పఠాన్​' సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్​ చేసిన బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్​ కూడా ప్లేస్​ సంపాదించుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే 'టైమ్‌' నిర్వహించిన 100 వార్షిక జాబితా ఆన్‌లైన్‌ పోల్‌లో బాద్​ షా అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వీరిద్దరికే ఈ అవకాశం దక్కడం విశేషం. కాగా, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులతో కూడిన జాబితాను 'టైమ్స్‌' ఈ లిస్ట్​ను విడుదల చేసింది. ఇంకా ఈ 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌, హాలీవుడ్‌ తార ఏంజెలా బాసెట్‌, ప్రఖ్యాత రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మి, బుల్లితెర ప్రయోక్త తదితరులకు చోటు దక్కింది.

అయితే ఆ లీస్ట్​లో​ చోటు సంపాదించుకున్న తొలి భారతీయ దర్శకుడు రాజమౌళినే! దీంతో పలువురు సినీ విశ్లేషకులు, అభిమానులు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి సిరీస్​తో ప్రపంచానికి పరిచయమైన రాజమౌళి.. గతేడాది 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో మరోసారి తానేంటో నిరూపించారు. ఆ సినిమా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్​ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఎన్టీఆర్​, రామ్​చరణ్​కు కూడా ప్రత్యేక క్రేజ్​ను తీసుకొచ్చింది. ఇంకా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇక ఆ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్​కు ప్రతిష్టాత్మక 'ఆస్కార్‌' పురస్కారం కూడా వరించింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్​బాబుతో ఓ భారీ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారు. దీన్ని మూడు భాగాలుగా రూపొందిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక షారుక్​.. తమిళ యంగ్ డైరెక్టర్​ అట్లీ దర్శకత్వంలో 'జవాన్'​ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'టైగర్‌ 3'లో అతిథి పాత్రలో మెరవనున్నారు. అలాగే దర్శకుడు రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' చిత్రంలో కూడా కనిపించనున్నారు.

ఇదీ చూడండి: Shaakuntalam review: సమంత 'శాకుంతలం'.. ఎలా ఉందంటే?

Last Updated : Apr 14, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.