ETV Bharat / entertainment

'కాంతారా'పై కంప్లైంట్​.. ఆ పాట కాపీ చేశారంటూ..

author img

By

Published : Oct 25, 2022, 1:06 PM IST

ఇటీవలే విడుదలై సూపర్​హిట్​గా నిలిచిన కాంతార సినిమాకు ఓ సమస్య ఎదురైంది. ఈ చిత్రంలోని ఓ పాటను కాపీ చేశారంటూ చిత్రబృందంపై ఆరోపణలు చేసింది ఓ సంగీత బృందం. తమకు మద్దతు ఇవ్వాలని కోరింది.

Kantara song complaint
'కాంతారా'పై కంప్లైంట్

'కాంతార'.. ఇండియన్​ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడా చూసిన ఇదే పేరు వినపడుతోంది. ఎందుకంటే ఇటీవల విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్​ ముందు సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని నటీనటుల నటన, సన్నివేశాలు, పాటలు, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​.. ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో భాష, ప్రాంతాలకు అతీతంగా సినీ ప్రేక్షకులంతా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ మూవీ మంచి వసూళ్లను అందుకుంటోంది.

అయితే ఇప్పుడా చిత్రానకి ఓ సమస్య ఎదురైంది. ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచే 'వరాహ రూపం.. దైవ వరిష్ఠం..' పాటను కాపీ చేశారంటూ చిత్ర బృందంపై తాజాగా కేరళలోని ఓ సంగీత బృందం 'థాయికుడమ్‌ బ్రిడ్జ్‌' ఆరోపణలు చేసింది. తమ బృందానికి చెందిన 'నవరసం' అనే పాటకు కాపీ చేశారంటూ పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేసింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సోషల్‌ మీడియాలో నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.

''కాంతార సినిమాకు మాకు(థాయికుడమ్‌ బ్రిడ్జ్‌) ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలోని 'వరాహరూపం..'పాట మేము రూపొందించిన 'నవరసం' పాటలానే ఉంది. మా అంగీకారం లేకుండా ఇలా కంపోజ్‌ చేయడం కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించడమే. స్ఫూర్తిగా తీసుకొని పాటను చేయడానికి, కాపీ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. అలాగే అది వివాదస్పదం కూడా. అందుకే మేము ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మేము మా శ్రోతలందరినీ మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం'' అని థాయికుడమ్‌ బ్రిడ్జ్ కోరింది. ఈ పోస్టుకు కాంతార సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్‌ చేసింది. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'విక్రమ్'​ టు 'కాంతారా'.. ఈ థీమ్ సాంగ్స్​ సూపర్​ హిట్​.. మీరు విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.