ETV Bharat / entertainment

భూతకోల ఉత్సవాల్లో అనుష్క.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ!

author img

By

Published : Dec 20, 2022, 12:28 PM IST

హీరోయిన్ అనుష్క భూతకోల ఉత్సవాల్లో సందడి చేసిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమెను ఇలా నెట్టింట చూసిన ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు. త్వరలోనే ఆమె నటిస్తున్న సినిమా రిలీజై సూపర్​ హిట్​ అవ్వాలని ఆశిస్తున్నారు.

Anushka in bhoota kola celebrations
భూతకోల ఉత్సవాల్లో అనుష్క.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ!

తుళునాడులోని భూతకోల సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రం 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్​ బాక్సాఫీస్​ ముందు సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రం తర్వాత ఈ భూతకోల ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం మొదలయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు చాలా మంది దీని గురించి తెలుసుకునేందుకు స్పెషల్​​ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టి కుటుంబ సమేతంగా ఈ భూతకోల ఉత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంగళూర్​లో జరిగిన భూత కోల వేడుకల్లో అనుష్క తన కుటుంబంతో కలిసి పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె అక్కడి నృత్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ కనిపించారు. పట్టుచీర కట్టుకుని ఎంతో అందంగా కనిపించారు. మరి ఇది పాత వీడియోనా లేదా కొత్తదా అనే స్పష్టం లేదు.

కాగా, అనుష్క నిశ్శబ్దం చిత్రం తర్వాత చాలా కాలంగా వెండితరపై కనిపించలేదు. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం చేస్తున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమెను ఇలా భూతకోల ఉత్సవాల్లో కనిపించే సరికి.. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అనుష్క సినిమా త్వరగా రిలీజ్ కావాలని మంచి హిట్​ అందుకోవాలని కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: పవన్​తో గొడవ.. అసలు విషయం చెప్పేసిన అలీ.. 6 ఏళ్ల పాటు ఒక్క పూట భోజనంతోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.