ETV Bharat / city

VIRAL VIDEO: స్నానానికి బాత్ రూమ్​లోకి వెళ్లగానే..సీన్​ చూసి షాక్​

author img

By

Published : Oct 13, 2021, 4:50 PM IST

Updated : Oct 13, 2021, 5:26 PM IST

KING COBRA
అమ్మో ఎంత పెద్ద పామో...

చచ్చిన పాము దగ్గరకు వెళ్లాలన్నా.. చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది బతికున్న పామును దగ్గరగా చూస్తే..? అది కూడా ఏ సాధారణ పామో కాకుండా.. మనిషికి రెండింతలుండే కింగ్ కోబ్రా అయితే..? పడగ విప్పి ఠీవీగా నిలబడి బుసలు కొడుతుంటే..? గుండెలు జారిపోయి, వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఊరు మొత్తాన్నే హడలెత్తించిన ఆ కింగ్ కోబ్రాను మీరూ చూడండి..

అమ్మో ఎంత పెద్ద పామో...

దట్టమైన అడవుల్లో కనిపించే అత్యంత విషపూరితమైన గిరినాగు పాము (కింగ్ కోబ్రా) విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లిలోని ఓ ఇంట్లో కనిపించింది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఏకంగా ఇంట్లోకి దూరింది. బాత్ రూంలోకి ప్రవేశించిన ఆ భారీ పాముని చూసి ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా భయపడి పరుగులు పెట్టారు. ఊరు మొత్తం అక్కడికి చేరుకున్నా.. ఏమీ చేయలేకపోయారు.

ఈ సంగతి తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. వారు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు కూడా అంత సులువుగా ఆ పామును పట్టుకోలేకపోయారు. దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి ఎంతో చాకచక్యంగా.. గిరినాగు పామును పట్టుకున్నారు.

దీని పొడవు దాదాపుగా 13 అడుగులకు పైగా ఉంది. ఈ భారీ గిరినాగును సజీవంగా పట్టుకొన్న వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులు.. ఆ సర్పాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇవి ఎక్కువగా దేశంలోని తూర్పు కనుమల్లో, ఆగ్నేయ ఆసియా దేశాల్లో కనిపిస్తాయని చెబుతున్నారు వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులు.

ఇవి ఆహారంగా పాములను మాత్రమే తింటాయని చెప్పారు. ఈ భారీనాగు ఏడాదిలో 350 వరకు పాములను వేటాడి తినగలుగుతుందన్నారు. ఈ రకం పాముల వలన ఉపయోగమేనని తెలిపారు. గిరినాగు పాము చాలా అరుదైన జాతి అని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. గిరినాగు దాని ప్రాణ రక్షణ కోసం పడగ విప్పి.. నాలుగు అడుగులకు పైగా ఎత్తుకు ఎగురుతుందని తెలిపారు.

ఇదీ చదవండి : Strike with Oil Tankers : నిలిచిపోయిన 1200 పెట్రోల్ ట్యాంకర్లు.. అంతా వాళ్లే చేస్తున్నారట!

Last Updated :Oct 13, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.