ETV Bharat / city

విశాఖలో తీగ లాగితే... కోల్​కతాలో డొంక కదిలింది!

author img

By

Published : Oct 26, 2019, 1:11 PM IST

cyber crime in vishaka

మోసగాళ్లంటే ఒకప్పుడు జనాలు ఎక్కువున్న ప్రాంతాలకే పరిమితం. కానీ రోజులు మారాయి. మోసం అనే పదానికి ఇప్పుడు కేరాఫ్​ అడ్రస్ ​ఆన్​లైన్. అదే అదునుగా... వలపు వల విసిరారు కొంతమంది యువతులు. చివరకు వాళ్ల కథ ఏమైంది? ఇంతకీ వాళ్లు ఎవరు?

వలపు వల విసిరారు.. దొరికారు!

ఇప్పడు.. డేటింగ్ వెబ్​సైట్లు అంటే మహా క్రేజ్. డబ్బు సంపాదించేందుకు ఆ మార్గాన్నే ఎంచుకున్నారు కోల్​కతాకు చెందిన కొంతమంది యువతులు. కోల్​కతాలో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. అక్కడినుంచే కార్యకలాపాలు సాగించారు. యువకులకు ఫోన్ చేయడం... మాయమాటలతో డబ్బులు వసూలు చేయడం.. ఇదే వారి పని. ఈ ముఠా విశాఖలో ఒకరి నుంచి రూ.18 లక్షలు మరొకరి నుంచి 3 లక్షలు వసూలు చేసింది. బాధితులు విశాఖ సైబర్ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే.. కోల్​కతాలో డొంక కదిలింది. సీఐ గోపినాథ్​ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లింది. కోల్​కతాలో ఓస్లామ్​ ఐటీ కంపెనీ పేరిట కార్యకలాపాలు నడిపిస్తున్నారు. 24 టెలీకాలర్లతో సహా 27 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3 ల్యాప్​టాప్​లు, 40 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:రోజుకు రూ.200: సరిహద్దు దాటేసి.. హౌరా ఎక్కేసి!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.