ETV Bharat / city

ABVP: "లీకులకు నైతిక బాధ్యత వహిస్తూ.. మంత్రి బొత్స రాజీనామా చేయాలి" - ఏబీవీపీ

author img

By

Published : May 6, 2022, 6:15 PM IST

ABVP
మంత్రి బొత్స క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం

ABVP: పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంత్రి బొత్స క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ABVP: మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ (A.B.V.P) కార్యకర్తలు ప్రయత్నించడంతో.. ఉద్రిక్తత చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. లీకులకు నైతిక బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరికి నిరసన కారులను అరెస్టు చేసి పోలీస్టేషన్​కి తరలించారు.

మంత్రి బొత్స క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం

ఇదీ చదవండి: రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.