ETV Bharat / city

ఒంటికాలితో అయ్యప్ప భక్తుడి సాహసయాత్ర.. 750 కి.మీ నడక

author img

By

Published : Jan 4, 2022, 8:30 PM IST

ఒంటికాలితో అయ్యప్ప భక్తుడి సాహసయాత్ర
ఒంటికాలితో అయ్యప్ప భక్తుడి సాహసయాత్ర

Disabledman walk to Sabarimala: కరోనా సమయంలోనూ ఎన్నో సవాళ్లను అధిగమించాడు.. ఆత్మవిశ్వాసంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అయ్యప్పస్వామిని దర్శించుకున్నాడు. అయితే ఇందులో గొప్పేమీ ఉంది..అందరూ దర్శించుకుంటారు కదా అంటారా.. ఇక్కడే ఉంది ఆ భక్తుడి స్వామి భక్తి.. ఆ భక్తుడు ఒంటి కాలితో దాదాపు 750 కి.మీ నడిచి శబరిమలకు చేరుకున్నాడు.

భక్తుడు సురేశ్​కు సహకరిస్తున్న ఆలయ సిబ్బంది
భక్తుడు సురేశ్​కు సహకరిస్తున్న ఆలయ సిబ్బంది

disabled man walking 750 kms: నెల్లూరు జిల్లాకు చెందిన అకరపక్క సురేశ్​ అనే దివ్యాంగుడు అనేక వ్యయప్రయాసలను అధిగమించి.. కాలినడకన శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. కేవలం ఒక్క కాలుతో.. నెల్లూరు నుంచి 750 కిలోమీటర్లకు పైగా నడిచి శబరిగిరీశుడు అయ్యప్ప సన్నిధికి చేరుకున్నాడు. ఓ ఊతకర్రను సాయంగా చేసుకుని.. పవిత్రమైన అయ్యప్ప ఇరుముడిని తలపై పెట్టుకుని మహాపాదయాత్రను సురేశ్​ పూర్తి చేశాడు.

అఖిల భారత అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సభ సభ్యుడైన సురేశ్​.. ఈ యాత్రను అకుంఠిత దీక్షతో 105 రోజుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆయన తన స్వగ్రామం నుంచి వివిధ రాష్ట్రాలను దాటుకుంటూ.. 750 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇందుకోసం ఆయన సెప్టెంబరు మాసం 20వ తేదీన తన నడకను ప్రారంభించాడు. నగరంలోని ఓ బంగారు వ్యాపార సంస్థలో స్వర్ణకారుడిగా పని చేస్తున్న సురేశ్​.. శబరిమలను దర్శించుకోవడం ఇది రెండోసారని తెలుస్తోంది.

స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్లిన సురేశ్​కు అక్కడి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ.. వేగంగా దర్శనాన్ని పూర్తి చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు : కంటేపల్లి వద్ద కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.