ETV Bharat / city

CM Jagan Kadapa tour : పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభించిన సీఎం జగన్

author img

By

Published : Feb 20, 2022, 12:37 PM IST

Updated : Feb 20, 2022, 2:23 PM IST

CM Jagan Kadapa tour :ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన పుష్పగిరి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు

CM Jagan Kadapa tour
CM Jagan Kadapa tour

CM Jagan Kadapa tour :ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్న సీఎంకు.. మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్‌లో కడప రిమ్స్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన పుష్పగిరి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు.

పెళ్లికి హాజరు

అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కుమార్తె పెళ్లికి సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కడప నుంచి గన్నవరం బయలు దేరారు. సీఎం పర్యటన సందర్భంగా కడప నగరంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.


సాయంత్రం విశాఖకు వెళ్లనున్న సీఎం
సీఎం జగన్​.. కడప పర్యటన అనంతరం సాయంత్రం 4.45 గంటలకు విశాఖకు వెళ్లనున్నారు. ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ నేపథ్యంలో విశాఖకు వస్తున్న రాష్ట్రపతి కొవింద్​కు ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద స్వాగతం పలకనున్నారు. తిరిగి రాత్రి 7 గం.కు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


ఇదీ చదవండి

కష్టాలను ఎదురీది.. అండర్​-19 ప్రపంచకప్​ హీరోగా తెలుగు తేజం

Last Updated :Feb 20, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.