అసభ్య పదజాలంతో దూషించిన ఫీల్డ్ అసిస్టెంట్‌ - అధికారులకు ఉపాధి కూలీల ఫిర్యాదు - NRGES Workers Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 5:29 PM IST

thumbnail
ఫీల్డ్ అసిస్టెంట్‌ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఉపాధి కూలీల నిరసన (ETV Bharat)

NRGES Workers Complaint on Field Assistant in Giddalur : ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎన్ఆ​ర్​ఈజీఎస్​​ (National Rural Employment Guarantee Scheme) కార్యాలయం వద్ద నరవ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి రాని వారికి కూడా వచ్చినట్లు హాజరు వేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తాము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్తే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని బాధితులు వాపోతున్నారు.

అన్యాయాలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్​ను తొలగించి కొత్త వారిని నియమించాలని లిఖితపూర్వకంగా సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. వారు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించిన ఎన్​ఆర్​ఈజీఎస్​ అధికారి ఫీల్డ్​ అసిస్టెంట్​పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధి కూలీలు నిరసన విరమించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.