ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Jun 19, 2022, 9:00 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • నర్సీపట్నంలో హైటెన్షన్.. అయ్యన్నపాత్రుడు ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
    Ayyannapatrudu: మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని.. ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను జేసీబీలతో కూల్చేందుకు యత్నించారు. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • APPSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకాన్ని రద్దు చేయండి
    APPSC: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌, ఎనిమిది మంది సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం కాకుండా.. సామర్థ్యం, అర్హత, యోగ్యత, నిష్పాక్షిక దృక్పథం, నైతిక నిష్ఠ లేనివారిని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులుగా నియమించారని, వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ వైకాపాతో అనుబంధ కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • శివార్లలోనూ బార్లు.. నగరాలు, పట్టణాలకు దూరంగా ఏర్పాటుకు అవకాశం
    మద్య నిషేధం విషయంలో తానిచ్చిన హామీని జగన్‌ ప్రభుత్వం విస్మరించినట్లేనా? ప్రభుత్వ చర్యల్ని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బార్ల సంఖ్యను తగ్గించే ప్రసక్తే లేదని, ఇప్పటివరకూ ఎన్ని ఉన్నాయో.. రాబోయే మూడేళ్లలోనూ అన్నే కొనసాగుతాయని చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సొంతానికి సంతర్పణ.. వైకాపా కార్యాలయాలకు కోట్ల విలువైన భూముల కేటాయింపు
    వైకాపా జిల్లా కార్యాలయాల కోసం ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు కేటాయించేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలని వైకాపా పెద్దలకు ఆలోచన వచ్చిందే తడవుగా చకచకా పావులు కదులుతున్నాయి. స్థలం చూడటం.. విజ్ఞప్తి పంపడం వరకే నాయకుల వంతు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సెల్​ఫోన్ల రాకతో.. ఎంపీల పనితీరే మారిపోయింది: ఓం బిర్లా
    సెల్‌ఫోన్‌ రాకతో ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు పెరిగిపోయాయని, ఫలితంగా క్షేత్రస్థాయిలోనే ఎక్కువగా ప్రజాప్రతినిధులు ఉంటున్నట్లు చెప్పారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎంపీల పనితీరులో సమూల మార్పు వచ్చినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆరని నిరసనాగ్ని.. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోనూ ఆందోళనలు
    Agnipath Protests: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రాజుకున్న నిరసనాగ్ని దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా పలు రాష్ట్రాల్లో సైనిక ఉద్యోగార్థులు విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. కొత్త సైనిక నియామక విధానాన్ని రద్దు చేయాల్సిందేనని నినదించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అన్నం దొరక్క ప్రజల ఇక్కట్లు.. సాగుబాట పట్టిన సైన్యం!
    ఒకప్పుడు బియ్యం ఉత్పత్తిలో స్వయంసమృద్ధమైన శ్రీలంక నేడు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది. లక్షలమంది ఆహారం కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ కొరత తీర్చటానికి ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. సైనికులు కలుపు తీసి దుక్కి దున్ని వివిధ పంటలకు నాట్లు వేస్తారు. వీరికి వ్యవసాయ నిపుణులు తోడ్పడతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • '3, 4 ఏళ్లు ధరలు పైకే.. తీవ్ర ఆర్థిక సమస్యలకు దగ్గరగా వెళ్తున్నాం'
    Jim Rogers on Inflation: భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. సింగపూర్​కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, ఆర్థిక నిపుణులు జిమ్​ రోగర్స్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • IND Vs SA: దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్​.. గెలిచినోళ్లదే సిరీస్
    IND VS SA Fifth T20: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగానే జట్టుపై ఎన్నో విమర్శలు, కుర్రాళ్ల సత్తాపై ఎన్నో సందేహాలు! సిరీస్‌ గెలవడం సంగతటుంచి వైట్‌ వాష్‌ తప్పించుకుంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు! అన్నింటినీ తట్టుకుని నిలబడ్డ యువ జట్టు.. విశాఖలో అదిరే ప్రదర్శనతో బోణీ కొట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్షమాపణలు చెప్పిన సాయిపల్లవి.. వాళ్లకు మాత్రం కృతజ్ఞతలంటా..!
    Sai pallavi: తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. నటి సాయిపల్లవి ఓ వీడియో విడుదల చేసింది. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తనకి సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.