ETV Bharat / city

తెలంగాణ: ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు.. ఏడుగురిపై కేసు

author img

By

Published : Dec 22, 2020, 10:26 PM IST

dancing with swords at mp arvinds rally
తెలంగాణ: ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు.. ఏడుగురిపై కేసు

జగిత్యాల జిల్లా అల్లీపూర్​లో యువకులు హల్​చల్​ చేశారు. ఎంపీ అర్వింద్​ హాజరైన కార్యక్రమంలో తల్వార్లతో నృత్యాలు చేశారు.

తెలంగాణ: ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు.. ఏడుగురిపై కేసు

తెలంగాణలోని జగిత్యాల జిల్లా అల్లీపూర్​లో తల్వార్లతో నృత్యాలు చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయికల్ మండలం అల్లీపూర్​లో శివాజీ విగ్రహావిష్కరణకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ హాజరయ్యారు. ఈ సందర్భగా నిర్వహించిన ర్యాలీలో యువకులు తల్వార్లతో హల్​చల్ చేశారు.

ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. ఖడ్గాలతో నృత్యాలు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లా రైతుకు..తెలంగాణ సీఎం ఫోన్ చేసి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.