ETV Bharat / city

రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు

author img

By

Published : Jun 1, 2020, 6:10 PM IST

Updated : Jun 1, 2020, 6:26 PM IST

rajya sabha election 2020
rajya sabha election 2020

రాజ్యసభ ఎన్నికల తేదీని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 19న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జూన్ 19న ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు గతంలోనే జరగాల్సి ఉండగా.. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్​లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైకాపా నుంచి నలుగురు, తెదేపా నుంచి ఒకరు బరిలో ఉన్నారు. గుజరాత్‌- 4, మధ్యప్రదేశ్‌ 3, రాజస్థాన్ 3, ఝూర్ఖండ్‌-2, మణిపూర్‌- 1, మేఘాలయ- 1 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇదీ చదవండి

నిమ్మగడ్డ రమేశ్​ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

Last Updated :Jun 1, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.