ETV Bharat / city

ప్రధానవార్తలు@9AM

author img

By

Published : Jul 24, 2022, 9:04 AM IST

AP Topnews
AP Topnews

.

  • Merger of schools: పాఠశాలల విలీనంపై పునరాలోచనలో ప్రభుత్వం.. జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు
    ప్రభుత్వ పాఠశాలల విలీనంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో మరోసారి పరిశీలనకు జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • NDB Loan Funds: ఎన్‌డీబీ రుణం వచ్చినా.. బిల్లుల చెల్లింపుల్లేవు.. మరి రూ.230 కోట్లు ఏమయ్యాయో?..
    అది విదేశీ బ్యాంకు కావడంతో రహదారుల విస్తరణ పనులు చేపట్టాక.. సకాలంలో బిల్లులు చెల్లిస్తారా అనే అనుమానం గుత్తేదారుల్లో ఉండేది. అయితే ఆ బ్యాంకు నుంచి చెల్లింపులకు ఢోకా ఉండదని అధికారులు, ఇంజినీర్లు అభయమిస్తూ వచ్చారు. అది నమ్మి కొన్ని జిల్లాల్లో పనులు చేశారు. అయితే బిల్లుల కోసం వాటిని అప్​లోడ్​ చేశారు కానీ.. నెలలు గడిచిపోతున్నాసరే అధికారులు చెల్లింపుల ఊసెత్తడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • TIRUMALA: శ్రీవారికి భారీగా పెరుగుతున్న హుండీ కానుకలు..వరుసగా ఐదో నెలా రూ.100కోట్లు పైనే
    కరోనా తర్వాత శ్రీవారికి హుండీ కానుకలు భారీగా లభిస్తున్నాయి. మార్చి నెల నుంచి ఇప్పటివరకు నెలనెలా రూ. 100 కోట్లకు పైనే కానుకలు వస్తున్నాయి. భక్తుల నుంచి ఇదే తరహాలో హుండీ కానుకలు లభిస్తే స్వామివారికి ఈ ఏడాది రూ.1500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తితిదే గణాంకాధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Accident: అన్నమయ్య జిల్లాలో లారీ, ఆటో ఢీ.. ఐదుగురు మృతి
    లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రైల్వే కమ్మపల్లి క్రాస్​ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • భాజపా నేత వేశ్యాగృహంపై పోలీసుల దాడి.. 73 మంది అరెస్ట్
    మేఘాలయ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్​ తన ఫాంహౌస్​లో నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై పోలీసులు దాడులు జరిపి.. ఆరుగురు మైనర్లకు విముక్తి కల్పించారు. దాంతో పాటు 73 మందిని అరెస్టు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'పక్షపాత రాజకీయాలు వద్దు.. గాంధేయవాదమే మేలు'.. వీడ్కోలు ప్రసంగంలో కోవింద్
    పక్షపాత ధోరణికి అతీతంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని సూచించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. పార్లమెంట్​ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంలో తాను ఒక భాగమని.. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'మా పని మనిషితోనే స్టెరాయిడ్స్​ ఇప్పించారు.. బాలీవుడ్ మాఫియా వేధిస్తోంది'
    కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. దీని వెనుక బాలీవుడ్ మాఫియా ఉందని హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేశారు. ఎవరైనా సరే, ఏదో ఒకటి చేసి తనకు సాయం చేయాలంటూ తాజాగా ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • టీమ్​ఇండియా మరో సిరీస్​ పట్టేస్తుందా.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే
    చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్‌ అందుకున్న ధావన్‌, శ్రేయస్‌.. దాదాపు 19 నెలల విరామం అనంతరం ఆడిన తొలి వన్డేలో సత్తాచాటిన శుభ్‌మన్‌ గిల్‌.. ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో పేస్‌ విభాగాన్ని సమర్థంగా నడిపించిన సిరాజ్‌.. వెరసి వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న టీమ్‌ఇండియా దూకుడు మీదుంది. ఇదే జోరులో నేడు రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. మిడిలార్డర్‌ గాడిన పడితే జట్టుకు తిరుగులేనట్టే!. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'యువతే మా టార్గెట్.. మేం కూడా విద్యుత్ స్కూటర్​ తీసుకొస్తాం'
    యువత సరికొత్త హంగులు ఉన్న ద్విచక్ర వాహనాలపైనే మొగ్గు చూపిస్తున్నారని యమహా మోటారు ఇండియా గ్రూపు ఛైర్మన్ ఐషిన్‌ చిహానా అన్నారు. విదేశాల్లో లభ్యమవుతున్న వాహనాలు ఇక్కడా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. యువతను ఆకట్టుకుని, మార్కెట్ వాటా పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • లంక అధ్యక్ష భవనంలో 1000 కళాఖండాలు మాయం!
    ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని, ప్రధాని నివాసాన్ని ఇటీవల ఆక్రమించుకున్నప్పుడు దాదాపు వెయ్యికిపైగా కళాఖండాలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులూ ఉన్నట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.