ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

author img

By

Published : Sep 28, 2022, 7:01 PM IST

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

..

  • విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.. స్పష్టం చేసిన కేంద్రమంత్రి
    Ashwini Vaishnav on Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే జోన్‌ విషయంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. జోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్థల ఎంపిక జరిగిందని... అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Ramana Dikshitulu: ఆ వివాదాస్పద ట్వీట్​తో మరోసారి వార్తల్లోకి రమణ దీక్షితులు
    Ramana Dikshitulu: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం జగన్​ తిరుమల పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు చేసిన ఓ వివాదాస్పద ట్వీట్​ చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్​లో ఏముందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనంతపురంలో 'గాడ్ ఫాదర్' మూవీ ప్రీ రీలీజ్​.. అభిమానుల సందడి
    Mega Star Chiranjeevi: మెగాస్టార్​ చిరంజీవి అంటేనే ఓ క్రేజ్​... ఆ హీరో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. చిరంజీవిని ఒక్కసారైనా చూడాలని ప్రతి అభిమానికి కోరిక ఉంటుంది. ఇక ఆ హీరో తమ ప్రాంతానికి వస్తే.. వారి ఆనందానికి హద్దు ఉంటుందా.. ఇదే ఫీలింగ్​లో ఇప్పుడు అనంతపురం చిరు అభిమానులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విద్యుత్ బకాయిల వివాదం.. తీవ్రమైన చర్యలకు దిగొద్దు: తెలంగాణ హైకోర్టు
    High Court On Electricity Dues Dispute: ఏపీ, తెలంగాణ విద్యుత్‌ బకాయిల వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అప్పటివరకు తెలంగాణపై కఠినమైన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దసరా బొనాంజా.. వారికి 78 రోజుల బోనస్​.. DA 4% పెంపు.. పేదలకు రేషన్​ ఫ్రీ
    పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్‌లో మొదలైన ఈ పథకాన్ని డిసెంబర్‌ 31 వరకు కొనసాగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మరోవైపు, రైల్వే ఉద్యోగులకు కూడా కేంద్రం.. దసరా బొనాంజా అందించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్​గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • PFI బ్యాన్​.. భాజపా, మిత్రపక్షాలు హర్షం.. RSS నిషేధానికి విపక్షాల డిమాండ్
    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్లు కేంద్రం నిషేధం విధించడంపై రాజకీయ పక్షాలు మిశ్రమ స్పందన వ్యక్తంచేశాయి. భాజపా, మిత్రపక్షాలు నిషేధాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్జేడీ, ఐయూఎమ్​ఎల్​ వంటి పార్టీలు ఆర్​ఎస్​ఎస్​ పైనా అదే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. సీపీఎం, మజ్లిస్‌ మాత్రం నిషేధాన్ని వ్యతిరేకించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తండ్రి కోసం కూతురి త్యాగం.. 60 శాతం కాలేయం దానం
    కాలేయాన్ని దానం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడింది ఉత్తరాఖండ్​కు చెందిన యువతి. సైన్యంలో పనిచేసిన తండ్రి లివర్ దెబ్బతినగా.. 60 శాతం కాలేయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు ఇద్దరూ కోలుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • క్యూబాలో తుపాను విధ్వంసం.. ఎటు చూసినా అంధకారం.. నెక్ట్స్ టార్గెట్ అమెరికా
    క్యూబాలో ఇయన్‌ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వేలాది చెట్లు నెలకూలాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన రాకాసి గాలులతో పలు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నుంచి విద్యుత్ సరఫరా నిలిచి, కోటి మందికిపైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అగ్రస్థానానికి అడుగు దూరంలో సూర్య.. కోహ్లీ, రోహిత్​ ఎక్కడున్నారంటే?
    సూర్యకుమార్​ యాదవ్​ ర్యాంకింగ్స్​లో మళ్లీ అదరగొట్టాడు. తన ర్యాంకును మెరుగుపరచుకుని రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఇంతకీ కోహ్లీ, రోహిత్​ ఏఏ స్థానాల్లో ఉన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చిరుత 15 ఇయర్స్​.. చిరంజీవి ఎమోషనల్​.. 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే
    రామ్​చరణ్​ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత నేటితో విడుదలై 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్​ చిరంజీవి.. చరణ్​ సినీ జర్నీని ప్రస్తావిస్తూ ఓ ఎమోషనల్​ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఈ చిత్ర విశేషాలను ఓ సారి నెమరువేసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.