విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.. స్పష్టం చేసిన కేంద్రమంత్రి

author img

By

Published : Sep 28, 2022, 4:01 PM IST

Updated : Sep 28, 2022, 7:50 PM IST

Ashwini Vaishnav

15:57 September 28

జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.. స్పష్టం చేసిన కేంద్రమంత్రి

Ashwini Vaishnav on Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే జోన్‌ విషయంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. జోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్థల ఎంపిక జరిగిందని... అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో స్థలం ఎక్కడ దొరుకుతుందనే సందిగ్ధం నుంచి బయటపడి... డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఎంపికలు అన్ని పూర్తయ్యాయని, కార్యాచరణలోనే ఉంది అని తెలిపారు. కేబినెట్​ భేటీ నిర్ణయాలు వెల్లడించే సమయంలో... అశ్వినీ వైష్ణవ్‌... వైజాగ్‌ జోన్‌ ఏర్పాటు వివరాలు వెల్లడించారు.

"జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశాం. రైల్వే జోన్‌ ఏర్పాటుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జోన్‌ ఏర్పాటుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. విశాఖ జోన్‌ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతాం." -అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర రైల్వేశాఖ మంత్రి

రైల్వేజోన్ అంశం రెండు రాష్ట్రాలకు చెందిన సమస్య కాదు: రైల్వేజోన్‌ అనేది రాజకీయపరమైన నిర్ణయమని, రైల్వేజోన్ అంశం రెండు రాష్ట్రాలకు చెందిన సమస్య కానేకాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రైల్వేజోన్‌కు రాష్ట్ర మంత్రివర్గం సమ్మతి ఇచ్చిందని,.. డీపీఆర్ తయారైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వోజోన్ పనులకు కొంత భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే రైల్వేజోన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు.

త్వరలోనే విశాఖకు రైల్వే జోన్ వస్తుందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై ఎలాంటి వివాదాలూ లేవని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఉందన్నారు.

జీవీఎల్‌: శాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగే వేస్తోందని.... భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాకే రైల్వే జోన్ ఆమోదించారని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌పై అపోహలు తొలగించేలా ప్రకటన చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ త్రిపాఠిని కోరినట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మధ్య ఇంతవరకు 29 సమావేశాలు జరిగాయని... ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యలు పరిష్కరించే దిశగా చర్చించుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 28, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.