ETV Bharat / Tdp Leaders Election Campaign

Tdp Leaders Election Campaign

ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారం ఊరూవాడా జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశంలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయి. జయహో బీసీ సభలు, ఆత్మీయ సమావేశాలతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు. వివిధ కులాలు, వర్గాల నేతలు కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి. మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్‌కు మద్దతుగా MLC పంచుమర్తి అనురాధ తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పామర్రులో కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి, MLA అభ్యర్థి వర్ల కుమార్ రాజా ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత, పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారం చేశారు. జనసేన అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కూటమి అభ్యర్థి బాలరాజు స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.