ETV Bharat / state

'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders Election campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 3:34 PM IST

election_campaign
election_campaign

Alliance Leaders Election campaign in AP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మరో వైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు.

'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం

Alliance Leaders Election campaign in AP : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మెుదలియార్ సామాజిక వర్గీయులతో కలిసి సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో అనేక అరాచకాలు జరిగాయని ఎన్నికల్లో వారిని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

Visakha District : విశాఖ జిల్లా పద్మనాభం మండలం నేరెళ్లవలస నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ,ఎంపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చిన్నాపురం వైకాపా నుంచి 20 కుటుంబాలు గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశంలో చేరాయి

వేడెక్కిన రాజకీయాలు - ఓవైపు ప్రచార హోరు, మరో వైపు వలసల జోరు - ELECTION CAMPAIGN IN AP

Prakasam District : ప్రకాశం జిల్లా అలవలపాడు, పొట్లపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ అరాచకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 'ఇంటింటికి మంచినీటి కుళాయి' కార్యక్రమం చేపడుతామని హామీ ఇచ్చారు.

NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం అభ్యర్థులు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.సూపర్‌సిక్స్‌ పథకాలు నచ్చి రోజు రోజుకు తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయని కేశినేని చిన్ని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామనీ హామీ ఇచ్చారు.

విజయవాడ తూర్పు నియోజక వర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహన్​ విస్తృతంగా పర్యటించారు. రేషన్​ కార్డు ఉంటే చాలు ప్రతి ఒక పథకం లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన సంఘీభావంగా గద్దె అనురాధ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాంగా పాల్గొన్నారు. కూటమి విజయానికి ఓటర్లందరూ కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తిరువూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికిపుడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సూపర్​ సిక్స్​ పథకాలను వివరిస్తూ ఓటర్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు.

మరింత జోరుగా ఎన్నికల ప్రచారాలు - కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన - All Parties Election Campaign

Bapatla District : బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశి నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసాయపాలెం, కంకటపాలెం, మురుకుంటపాడులోని ప్రజలకు సూపర్‌ సిక్స్ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పూర్తి స్థాయిలో విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో జగన్‌ సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు

Vijayawada : అభివృద్ధిలో నంబర్‌ వన్‌గా ఉండాల్సిన విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వెనుకబడిపోయిందని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనాచౌదరి విమర్శించారు. విజయవాడ 47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఆ ప్రాంతవాసుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. జగన్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యచరణతో సమస్యల్ని పరిష్కరిస్తామని సుజనాచౌదరి హామీ ఇచ్చారు.

'వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి'- ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు - ELECTION CAMPAIGN

Nellore District : నెల్లూరులో కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే కారణం టీడీపీ చేసిన అభివృద్ధేనని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్లీ చంద్రబాబే సీఎం రావాలని ఓటర్లుకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్ఖి ఆరిమిల్లి రాధాకృష్ణ స్థానిక పట్టణంలో 32, 33వ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తణుకు నియోజకవర్గంలో అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు.

Ambedkar Konaseema District : అంబేడ్కర్​ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి వేగుళ్ల నాగేశ్వరరావు మారేడుబాక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.