ETV Bharat / state

ఏపీలో ఎన్నికల హింసపై ఈసీ కొరడా - ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్​పై చర్యలకు ఆదేశం - EC suspend on few police officers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 8:42 PM IST

Updated : May 16, 2024, 10:43 PM IST

EC Suspend on Few Police Officers in AP : రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తరువాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో పలువురు కీలక అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది. మూడు జిల్లాలోని 12 మంది డీఎస్పీలపైనూ విచారణకు ఆదేశించింది. ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదించాలని స్పష్టం చేసింది.

EC Suspend on Few Police Officers in AP
EC Suspend on Few Police Officers in AP (ETV Bharat)

EC Suspend on Few Police Officers in AP : ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ అనంతరం రాష్ట్రంలో చోటు చేేసుకున్న పరిణాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హింసాఘటనలకు బాధ్యులను చేస్తూ, మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12మంది సబార్డినేట్‌ పోలీస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశించింది.

వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP

హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు : పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

ఆ అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోండి : పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ స్థాయిలో విధ్వంసానికి తెర తీసినా పోలీసులు నిలువురించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

వరుస ఘటనలు జరుగుతున్నా ఎందుకు అదుపు చేయలేక పోయారు : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలోని 9వ వార్డులోని పోలింగ్ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడులకు పాల్పడ్డారు. పోలింగ్ మరుసటి రోజున 14వ తేదీన వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడిచేశారు. వరుస సంఘటనలు జరుగుతున్నా తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపుచేయలేక విఫలమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డా.వినోద్ కుమార్ ను నివేదిక కోరింది. సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది.

ఓట్ల లెక్కింపు పూర్తయిన బలగాలను కొనసాగించాలని ఆదేశం : తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్‌పటేల్‌పైనూ సీఈసీ బదిలీ వేటు వేసింది. శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి ఘటనలో విఫలం చెందారని ఈసీ భావించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి ఐపీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులుపెట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీచేసింది.

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు - బదిలీ చేయాలని సీఎస్​కు ఆదేశాలు - EC TRANSFERRED DGP

వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్న అధికారులపై వేటు!- కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్​ వేటు

Last Updated : May 16, 2024, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.