అనంతలో వర్షం.. గొడుగు పట్టుకుని 'గాడ్ ఫాదర్' ప్రసంగం

author img

By

Published : Sep 28, 2022, 5:58 PM IST

Updated : Sep 28, 2022, 10:15 PM IST

Mega Star Chiranjeevi

Mega Star Chiranjeevi: మెగాస్టార్​ చిరంజీవి అంటేనే ఓ క్రేజ్​... ఆ హీరో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. చిరంజీవిని ఒక్కసారైనా చూడాలని ప్రతి అభిమానికి కోరిక ఉంటుంది. ఇక ఆ హీరో తమ ప్రాంతానికి వస్తే.. వారి ఆనందానికి హద్దు ఉంటుందా.. ఇదే ఫీలింగ్​లో ఇప్పుడు అనంతపురం చిరు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే.. ఈరోజు అనంతపురంలో 'గాడ్​ ఫాదర్​' సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ జరగనుంది. ఇప్పటికే అభిమానులంతా కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకుని సందడి చేశారు. కార్యక్రమం జరుగుతుండగా వర్షం పడింది... మెగాస్టార్​ చిరంజీవి వర్షంలోనే ప్రసంగించారు.

Chiranjeevi God Father Pre Release Event: అనంతపురంలో మెగాస్టార్ అభిమానుల సందడి నెలకొంది. అక్టోబర్ 5న చిరంజీవి కథానాయకుడిగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల కానుంది. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళ హిట్‌ సినిమా 'లూసిఫర్‌'కు రీమేక్‌గా రూపొందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్​ అనంతపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. వారి సందడితో కోలాహలం నెలకొంది.

గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రీలీజ్​ ఈవెంట్

కార్యక్రమం జరుగుతుండగా వర్షం కురిసింది. అభిమానులు తడుచుకుంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్​ చిరంజీవి వర్షంలో గొడుగు పట్టుకుని ప్రసంగించారు. తానెప్పుడూ రాయలసీమలో అడుగుపెట్టినా.. వరుణుడు పులకరిస్తూనే ఉంటాడని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 28, 2022, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.