ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Jun 29, 2021, 12:57 PM IST

ప్రధాన వార్తలు @ 1 pm
ప్రధాన వార్తలు @ 1 pm

.

  • DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..మీ అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్
    గొల్లపూడిలో 'దిశ యాప్' పై అవగాహన కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి మహిళ సెల్​ఫోన్​లో దిశ యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Sadhana Deeksha: సాధన దీక్షలో పాల్గొన్న చంద్రబాబు..
    అమరావతిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు నిరసన దీక్షకు దిగారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు.. పార్టీ నాయకులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా సాధన దీక్ష చేపడుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'కరోనా విపత్తును ఎదుర్కోవడంలో సీఎం విఫలమయ్యారు'
    కొవిడ్‌ బాధితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే సాధన దీక్ష చేపట్టామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • విజయనగరంలో డెల్టా వేరియంట్‌ కేసు..గత నెల 17న కొవిడ్‌ పరీక్షలు
    విజయనగరం జిల్లాలో తొలి డెల్టా వేరియంట్​ కేసు నమోదైంది. గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళకు సోకింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'అప్పటి వరకు ఒకే దేశం- ఒకే రేషన్ అమలు కావాల్సిందే'
    ఒకే దేశం-ఒకే రేషన్​ పథకాన్ని జులై 31 వరకు అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికుల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కొవిడ్​ కాలంలో మధుమేహాన్ని నియంత్రించండి ఇలా!
    మధుమేహం ఉన్నవారికి, ఇతరులకు వైరస్​ సోకే విషయంలో తేడాలు ఉండవు. కానీ... కరోనా వస్తే మాత్రం మిగిలినవారికన్నా చక్కెర వ్యాధిగ్రస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం ఎలా? షుగర్​ లెవల్స్​ను అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వివాదాస్పద మ్యాప్​ను తొలగించిన ట్విట్టర్​
    భారత మ్యాప్​ను వక్రీకరించి చూపించిన ట్విట్టర్​.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం వల్ల దానిని తొలగించింది. తన వెబ్​సైట్​లో భారత్​లో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లను ప్రత్యేక దేశంగా చూపించింది ట్విట్టర్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • భారత్​కు మరోసారి అమెరికా భారీ సాయం
    కరోనా నేపథ్యంలో భారత్​కు అమెరికా మరోసారి తన సాయాన్ని ప్రకటించింది. 41 మిలియన్​ డాలర్లను అందించనున్నట్లు చెప్పింది. అమెరికా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్‌కు.. ఇప్పుడు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందని యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్​ఏఐడీ) తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'నా రాజీనామాకు అతడితో గొడవ కారణం కాదు'
    పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్​ పదవి నుంచి తప్పుకోవడానికి, హసన్ అలీ(Hasan Ali)తో గొడవకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు యూనిస్ ఖాన్(Younis Khan). ఇలాంటి వార్తలు బయటకెలా వస్తాయో తెలియదని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • RRR: షూటింగ్​ పూర్తి.. చెప్పిన తేదీకే రిలీజ్​
    రెండు పాటలు మినహా 'ఆర్​ఆర్​ఆర్'(RRR)​ సినిమా షూట్​ పూర్తైందని తెలిపింది చిత్రబృందం. రామ్​చరణ్(Ramcharan)​, ఎన్టీఆర్(NTR)​ రెండు భాషల్లో డబ్బింగ్​ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.