ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : May 23, 2021, 1:00 PM IST

1pm top news
ప్రధాన వార్తలు @ 1 PM

.

  • 'సీఎంలు చెలగాటమాడుతున్నారు'
    రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పొందుగుల వద్ద వాహనదారులపై మళ్లీ లాఠీచార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తయారీకి తితిదే సిద్ధం
    ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఔషధం తయారీకి తితిదే సిద్ధమని పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో కలిసి ఆయుర్వేద ఔషధం పరిశీలించామన్న చెవిరెడ్డి..మందులో దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యులు చెప్పారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీసాల్లో.. సెలైన్‌ నీళ్లు !
    కరోనా రోగుల రెమ్‌డెసివిర్‌ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మత్తుమందు టెక్నీషియన్‌... ఘరానా మోసానికి తెరలేపాడు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను సేకరించి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపి అసలైన ఇంజక్షన్లుగా మార్చి మెడికల్ దుకాణాల నిర్వహకులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తుపాను ప్రభావం!
    తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నేటి రాత్రివరకు.. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా తుపాను ప్రభావం ఉంటుందని, ఇవాళ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లాక్​డౌన్ పొడిగింపు
    దిల్లీలో ఈనెల 31 వరకు లాక్​డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. మే 31 తర్వాత కేసులు తగ్గితే దశల వారీగా అన్​లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అధికారులతో మోదీ భేటీ
    యాస్​ తుపాను సన్నద్ధతపై ఉన్నత స్థాయి అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. సమావేశమయ్యారు. ఈ భేటీలో అమిత్​ షా తోపాటు జాతీయ విపత్తు నిర్వాహక నిపుణులు, వైమానిక దళం సభ్యులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అది ఓ హెచ్చరిక
    కరోనా రెండో దశ విజృంభణతో భారత్​, దక్షిణ అమెరికా సహా పలు ప్రాంతాల్లో ప్రజలు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడిన దుస్థితి కళ్లముందు కనిపించిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా కలకలం
    ఆదివారం నుంచి జరగాల్సిన శ్రీలంక-బంగ్లాదేశ్​ వన్డే సిరీస్​లో కరోనా కలవరం సృష్టించింది. తొలుత ముగ్గురు సభ్యులకు పాజిటివ్​గా తేలగా, మరోసారి పరీక్షలు చేస్తే అందులో ఇద్దరికి నెగిటివ్​ వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.