ETV Bharat / business

మంచి హైబ్రిడ్​ కారు కొనాలా? టాప్​-7 అప్​కమింగ్ మోడల్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 7:04 PM IST

Upcoming Hybrid Cars In India In Telugu : మీరు మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీ, సూపర్​ పెర్ఫార్మెన్స్ ఇచ్చే లేటెస్ట్​ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​. ఇండియన్ మార్కెట్లో వచ్చే రెండేళ్లలో మారుతి సుజుకి, టయోటా, ఫోక్స్​వ్యాగన్​, రెనో, నిస్సాన్ కంపెనీలకు చెందిన బెస్ట్​ హైబ్రిడ్​ కార్లు లాంఛ్ కానున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

latest Hybrid Cars In India
Upcoming Hybrid Cars In India

Upcoming Hybrid Cars In India : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐసీఈ కార్స్ హవా నడుస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ, వినియోగం పెరుగుతోంది. అయితే ఈ రెండింటి మధ్యలో హైబ్రిడ్​ వెహికల్స్​ కూడా ఉన్నాయి. ఇవి మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీ, సూపర్​ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందుకే చాలా మంది కస్టమర్లు ఈ హైబ్రిడ్ కార్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్​ హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి తెచ్చాయి. మరిన్ని సరికొత్త మోడళ్లను త్వరలో ఇండియన్ మార్కెట్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. New Gen Renault Duster Features : ఈ రెనో డస్టర్​ కారును 2025 ద్వితీయార్థంలో భారత్​ మార్కెట్లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ థర్డ్ జనరేషన్ రెనో డస్టర్​ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్​ 140 ఇంజిన్​ ఆప్షన్​తో వస్తుంది. ఇది హైబ్రిడ్​ సిస్టమ్ ఎలక్ట్రిక్​ ఆటోమేటిక్​ గేర్​బాక్స్​ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ రెనో కారు 1.6 లీటర్​ ఫోర్​ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 94 bhp పవర్ జనరేట్ చేస్తుంది. దీనితోపాటు 49 bhp పవర్ జనరేట్ చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఇందులో ఉంటాయి.

Renault Duster
రెనో డస్టర్

పట్టణాల్లో, నగరాల్లో ఈ రెనో డస్టర్ కారు 80 శాతం వరకు ఆల్​-ఎలక్ట్రిక్​ మోడ్​లో పనిచేస్తుంది. కనుక చాలా వరకు ఇంధనం ఆదా అవుతుంది. ఈ డస్టర్ కారు కొత్త CMF-B ప్లాట్​ఫారమ్​పై ఆధారపడి ఉంటుంది. రెనో కంపెనీ దీని డిజైన్​లో, ఫీచర్లలో అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.

Renault Duster
రెనో డస్టర్

2. New Gen Toyota Fortuner Features : టయోటా కంపెనీ బహుశా వచ్చే ఏడాదిలోనే ఈ ఫార్చ్యూనర్​ హైబ్రిడ్ కారును అంతర్జాతీయంగా లాంఛ్ చేయవచ్చని సమాచారం. కానీ భారత్​లో ఎప్పుడు దీనిని లాంఛ్ చేస్తారో స్పష్టంగా తెలియదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ టయోటా ఫార్చ్యూనర్​ కారులో, 2.8 లీటర్​ టర్బో డీజిల్​ ఇంజిన్​తో, 48V మైల్డ్​ హైబ్రిడ్​ సిస్టమ్​ను అనుసంధానం చేసినట్లు సమాచారం. దీనిలో స్ట్రాంగ్​ హైబ్రిడ్ పవర్​ట్రైన్​ అమర్చినట్లు మరికొన్ని వర్గాల సమాచారం. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Toyota Fortuner
టయోటా ఫార్చ్యూనర్
Toyota Fortuner
టయోటా ఫార్చ్యూనర్

3. New Gen Maruti Suzuki Swift And Dzire Features : న్యూ జనరేషన్​ మారుతి స్విఫ్ట్​ ఇటీవలే జపాన్​లో లాంఛ్ అయ్యింది. 2024లో భారత్​లోనూ ఇది లాంఛ్ కానుంది. మారుతి డిజైర్ బహుశా 2024 సెప్టెంబర్​లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కార్లు కూడా ఒకే రకమైన పవర్​ట్రైన్​ ఆప్షన్లతో వస్తాయని సమాచారం. ఈ మారుతి స్విఫ్ట్​, డిజైర్ కార్లలో 1.2 లీటర్​ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​ను అమరుస్తున్నారు. ఇది 82 bhp పవర్​, 108 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కార్లలో మైల్డ్​-హైబ్రిడ్​ సిస్టమ్​ కూడా ఉంటుంది. ఇది 13.5 PS పవర్​, 30Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ రెండూ కూడా ఇండియన్​ స్పెక్ వేరియంట్​లో ఉంటాయని భావించవచ్చు.

Maruti Suzuki swift
మారుతి సుజుకి స్విఫ్ట్​
Maruti Suzuki Dzire
మారుతి సుజుకి డిజైర్​

4. Maruti Suzuki 7 Seater SUV Features : మారుతి సుజుకి గ్రాండ్​ విటారాను బేస్​ చేసుకుని ఈ మారుతి సుజుకి 7 సీటర్ ఎస్​యూవీని రూపొందిస్తున్నారు. దీనిని 2024 చివరిలో భారత్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 1.5 లీటర్​ త్రీ సిలిండర్​ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్​ను అమరుస్తున్నట్లు సమాచారం. ఈ అప్​కమింగ్​ మారుతి ఎస్​యూవీ కారు నేరుగా టాటా సఫారీ, ఎంజీ హెక్టర్​ ప్లస్​, హ్యుందాయ్ అల్కజార్​, మహీంద్రా ఎక్స్​యూవీ700 కార్లతో పోటీపడనుంది.

Maruti Suzuki grand vitara
మారుతి సుజుకి 7 సీటర్​ ఎస్​యూవీ
Maruti Suzuki grand vitara
మారుతి సుజుకి 7 సీటర్​ ఎస్​యూవీ

5. Nissan X Trail Features : ఈ ఫోర్త్​ జనరేషన్​ మోడల్​ నిస్సాన్ ఎక్స్ ట్రైల్​ కారును గతేడాది అక్టోబర్​లో పరిచయం చేశారు. దీనిని వచ్చే ఏడాది ఇండియన్​ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫుల్​ సైజ్​ ఎస్​యూవీ కారును మల్టిపుల్ పవర్​ట్రైన్ ఆప్షన్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే భారత్​లో దీనిని 1.5 లీటర్​ పెట్రోల్ ఇంజిన్ +​ ఫుల్ హైబ్రిడ్​ టెక్​ ఇంజిన్​లతో తీసుకురావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Nissan X Trail
నిస్సాన్ ఎక్స్ ట్రైల్

6. Toyota Corolla Cross Based 7 Seater SUV Features : ఈ టయోటా కరోలా క్రాస్​ కారులో 2.0 లీటర్​ స్ట్రాంగ్ హైబ్రిడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. ఇది 184 bhp పవర్ జనరేట్ చేస్తుంది. వాస్తవానికి ఇన్నోవా హైక్రాస్​లోనూ ఇదే ఇంజిన్​ ఉండడం గమనార్హం. ఈ ఎస్​యూవీ కారును TNGA-C ఆర్కిటెక్చర్​ ఆధారంగా రూపొందించడం జరిగింది. భారత మార్కెట్లో ఇది నేరుగా హ్యుందాయ్​ టక్సన్​, జీప్ మెరిడియన్ కార్లతో పోటీపడనుంది.

Toyota Corolla Cross
టయోటా కరోలా క్రాస్
Toyota Corolla Cross
టయోటా కరోలా క్రాస్

7. Volkswagen Tayron Features : ఈ ఫోక్స్​వ్యాగన్ టైరాన్ కారను 2025 మొదట్లో లాంఛే చేసే అవకాశం ఉంది. ఇది 5 సీటర్​, 7 సీటర్​ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇది టర్బో పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో పాటు, ప్లగ్​-ఇన్​ హైబ్రిడ్​ (PHED) సెటప్​తో వస్తుందని సమాచారం.

Volkswagen Tayron
ఫోక్స్​వ్యాగన్ టైరాన్

రూ.15 లక్షల బడ్జెట్​లో మంచి కారు కొనాలా? టాప్​-10 మోడల్స్ ఇవే!

బెస్ట్ స్పోర్ట్స్​ బైక్​ కొనాలా? తక్కువ బడ్జెట్లోని టాప్​-10 టూ-వీలర్స్​ ఇవే!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.