ETV Bharat / business

మీ కుటుంబానికి భద్రత కల్పించేందుకు.. ఎంత లైఫ్ కవర్ సరిపోతుంది?

author img

By

Published : Jul 22, 2023, 4:34 PM IST

Life cover for family : ఓ కుటుంబానికి కావలసిన అన్ని ఆర్థిక వనరులు సమకూర్చేది ఆ కుటుంబ యజమాని. దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా జరిగితే.. ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకునేది టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీ. మరి ఈ బీమా పాలసీ ఎంత మేరకు ఉంటే మంచిది? తెలుసుకుందాం రండి.

Life cover calculation
How much life cover is enough for a family

Life cover calculation : దురదృష్టవశాత్తు ఒక కుటుంబ యజమాని మరణించినప్పుడు, అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేది టర్మ్ ఇన్సూరెన్స్​ పాలసీ. మరి ఈ బీమా పాలసీ ఎంత ఉండాలి? అనేది చాలా మందికి తలెత్తే ఒక కీలకమైన సందేహం.

బీమా కవరేజ్​ ఎంత ఉండాలి?
How much life cover is enough : చాలా మందికి తమకు ఎంత మేరకు బీమా పాలసీ అవసరమో తెలియదు. నిజానికి బాగా చదువుకున్నవారికి కూడా ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండడం లేదంటే, ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే బీమా కవరేజ్​ ఎంత ఉండాలి? దానిని ఎలా లెక్కించాలి? అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

How to calculate premium for life insurance : బీమాను లెక్కించడంలో వయస్సు చాలా కీలకం. ఉదాహరణకు ఒక వ్యక్తి వయస్సు 30 ఏళ్లులోపు ఉంటే.. అతని వార్షిక ఆదాయానికి కనీసం 20 నుంచి 25 రెట్లు జీవిత బీమా ఉండాలి. ఎందుకంటే, కాలం గడుస్తున్న కొద్దీ.. కుటుంబ జీవనశైలి, అవసరాలు క్రమేణా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల అనుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ మాత్రం జీవిత బీమా ఉండి తీరాలి.

ఒక వ్యక్తి వయస్సు 40 ఏళ్లలోపు ఉంటే.. అప్పుడు అతని బీమా మొత్తం వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు వరకు ఉండాలి. మరీ సింపుల్​గా చెప్పాలంటే.. నేటి కాలంలో కనీసం ఒక కోటి రూపాయల వరకు జీవితబీమా పాలసీ తీసుకోవాలి.

కుటుంబ భారం మొత్తం ఒక్కరిపైనే ఉన్నప్పుడు.. పదవీ విరమణ వయస్సు వరకూ.. కుటుంబ ఖర్చులకు, అప్పులకు సరిపోయేలా జీవిత బీమా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనుకోని దురదృష్టకర పరిస్థితుల్లో కుటుంబ యజమాని మరణిస్తే.. ఆ కుటుంబం ఎలాంటి ఆర్థిక ఒడుదొడుకులకు లోనుకాకుండా ఉంటుంది.

కోటి రూపాయల పాలసీ సరిపోతుందా?
How much life cover is enough for a family : వాస్తవానికి నేటి కాలంలో ఒక కోటి రూపాయల బీమా పాలసీ ఉన్నంత మాత్రాన అది అన్నింటికీ సరిపోతుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అప్పులు, కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం ఖర్చులు ఇవన్నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు వీటి గురించి కూడా చర్చిద్దాం.

రుణాలు :
జీవిత బీమా పాలసీని తీసుకునే ముందు కుటుంబానికి ఉన్న రుణాలు లేదా ఆర్థిక బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రుణాలను తీర్చేందుకు బీమా కవరేజీ సరిపోతుందా? లేదా? పరిశీలించాలి. అప్పుడే కుటుంబాన్ని అప్పుల బెడద నుంచి కాపాడవచ్చు.

కుటుంబ అవసరాలు :
కుటుంబ నిత్యావసరాలు, విద్య, వైద్యం ఖర్చులను అంచనా వేసి, వాటికి అనుగుణంగా జీవిత బీమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రుణాలు, వడ్డీలు చెల్లించిన తరువాత ఇది కుటుంబ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి.

ఆదాయాన్ని భర్తీ చేసేలా ఉండాలి :
Term insurance benefits : మీ కుటుంబ జీవనశైలికి అనుగుణంగా ఎంత డబ్బు అవసరం అవుతుంది? మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులు (పిల్లలు) ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి ఎంత సమయం పడుతుంది? అనే విషయంలో ఒక అంచనాకు రావాలి. అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇతర అనుకోని ఖర్చులనూ లెక్కించాలి.

దీర్ఘకాలిక లక్ష్యాలు :
Long term investment plans : కుటుంబ యజమాని తన పదవీ విరమణ కోసం పొదుపు చేయడం, కుటుంబానికి ఆస్తులను సమకూర్చడం లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సైతం లెక్కించాలి. జీవిత బీమా మొత్తం ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

ప్రీమియం :
life insurance premium : ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా సాధించాలంటే.. అందు తగిన బీమా రక్షణ, ప్రీమియం చెల్లింపు మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. వాస్తవానికి భారీ ప్రీమియాన్ని మీరు చెల్లించగలరా? లేదా? అనేది ముందుగానే చూసుకోవాలి. ఒకసారి పాలసీ తీసుకున్న తరువాత బీమా ప్రీమియాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి. అప్పుడే మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించి, మీ కుటుంబాన్ని ఆపదకాలంలో రక్షించుకోగలుగుతారు.

Life cover calculator : ప్రస్తుతం ఆన్​లైన్​లో పూర్తి ఉచితంగా.. ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని, మిమ్మల్ని ఆపదకాలంలో ఆదుకునే సరైన బీమా విలువను చాలా సులువుగా తెలుసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.