ETV Bharat / business

40 ఏళ్లలోపే 'సొంతింటి' కలను నెరవేర్చుకోవడమెలా?

author img

By

Published : Jun 19, 2023, 12:33 PM IST

Updated : Jun 19, 2023, 12:41 PM IST

Own House In 40s : మీరు ఇప్పుడే సంపాదించడం మొదలుపెట్టారా? మీ రాబడిలోంచి కొంత మొత్తం పొదుపు చేసి, సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. మీకు 40 ఏళ్లు వచ్చే నాటికి మీ సొంత ఇంటి కలను ఎలా నెరవేర్చుకోవాలో చూద్దాం రండి.

tips to buy your dream home at a young age
Tips to own your dream home before you turn 40s

Own House In 40s : సొంత ఇల్లు కట్టుకోవడం కోసం కలలు కంటున్నారా? 40 ఏళ్లలోపు మీరు కలల సౌధాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. సరైన ప్రణాళికతో, క్రమంతప్పకుండా పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే మీరు మీ సొంత ఇంటిని నిర్మించుకోగలరు. చిన్న తప్పు చేసినా మీ కలలు చెదిరిపోయే ప్రమాదం ఉంది.

మీ కలలు నిజం చేసుకోవడానికి ఏం చేయాలి?
మీరు ఇప్పుడు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వారైతే ఈ ప్లాన్​ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే సంపాదించడం మొదలుపెట్టి ఉంటే.. కేవలం 15 నుంచి 20 ఏళ్లలోపే మీ సొంత ఇంటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.

మ్యూచువల్​ ఫండ్స్​లో మదుపు
చిన్న వయస్సులోనే మీరు మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా లాభం పొందవచ్చు. కాంపౌండింగ్​ ఎఫెక్ట్​ వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు బాగా పెరిగి మీకు 40 ఏళ్లు వచ్చే సరికి మంచి సంపద మీ సొంతం అవుతుంది.

మీ ఇళ్లు ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోండి
మీ కలల సౌధం ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. ఏ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో.. సైజ్​, లేఅవుట్, స్టైల్​ మొదలైన అన్ని అంశాలపై మీకంటూ ఒక కచ్చితమైన అభిప్రాయం ఉండాలి.

మీ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకోండి
Own House in 40s : మీరు స్టాక్​ మార్కెట్​లోగానీ, మ్యూచువల్​ ఫండ్స్​లో గానీ పెట్టుబడులు పెట్టేముందు.. కచ్చితంగా మీ ఆర్థిక స్థితిగతులను పరిశీలించుకోండి. మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, పొదుపు లాంటి అన్ని అంశాలను చూసుకోండి. సాధారణంగా స్టాక్​ మార్కెట్​లో నష్టభయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కనుక మీరు ఎంత మేరకు రిస్క్​ తీసుకోగలరో చూసుకోండి. ముఖ్యంగా ఆదాయ వృద్ధి, రిస్క్ మేనేజ్​మెంట్​ విషయాల్లో చాలా కచ్చితంగా ఉండండి.

మీ ఆర్థిక లక్ష్యాలను ముందే నిర్ణయించుకోండి
మీ ఆర్థిక లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉండాలి. మీరు ఊహిస్తున్న ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకోండి. ఒక వేళ బ్యాంకు లోన్​ కోసం చూస్తుంటే.. దాని కోసం ఏమి చేయాలో తెలుసుకోండి.

సరైన మ్యూచువల్​ ఫండ్​ని ఎంచుకోండి
మీరు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేలా మంచి మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకోండి. ఈక్విటీ ఫండ్స్​ తీసుకుంటే.. దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. డెట్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెడితే మీకు స్టడీగా రెగ్యులర్ ఇన్​కమ్​ ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్​ను, డెట్​ ఫండ్స్​ను బ్యాలెన్స్​ చేస్తే.. ఫలితాలు బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఎస్​ఐపీ (సిప్) చేయండి
సిస్టమేటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్ (సిప్​) ప్రారంభించడం ఉత్తమం. దీని వల్ల చిన్న మొత్తంలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్​ పని చేయడం వల్ల దీర్ఘకాలంలో మీకు మంచి కార్పస్​ క్రియేట్ అవుతుంది. అలాగే మార్కెట్​లో వచ్చే ఒడుదొడుకుల ప్రభావం కూడా బాగా తగ్గుతుంది.

మీ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయండి
మీ పెట్టుబడులను విభజించి, వివిధ రంగాల్లో ఇన్వెస్ట్​ చేయడం మంచిది. ముఖ్యంగా మల్టిపుల్​ మ్యూచువల్​ ఫండ్స్​లో మదుపు చేయడం, స్టాక్స్​, రియల్​ ఎస్టేట్​, గోల్డ్​, ఫిక్స్​డ్​ డిపాజిట్స్​ చేయడం మంచిది.

క్రమం తప్పకుండా పెట్టుబడులను సమీక్షించుకోండి
పెట్టుబడులు పెట్టడమే కాదు.. క్రమం తప్పకుండా వాటిని సమీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్​ చేసిన మ్యూచువల్​ ఫండ్స్ పనితీరు ఎలా ఉందో గమనించండి. అలాగే మార్కెట్ ట్రెండ్​ను అనుసరించి, అవసరమైన ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోండి.

ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోండి
మీ నిర్దిష్టమైన వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మంచి ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఎంతైనా ఉత్తమం. ఎందుకంటే, అతడు మీ రిస్క్ ప్రొఫైల్​ను చూసి, మీకు తగిన మ్యూచువల్​ ఫండ్స్​ను, పెట్టుబడుల వ్యూహాన్ని చెప్పగలుగుతారు. అలాగే మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి మంచి మార్గం చూపిస్తారు. ఆర్థిక నిపుణులు క్రమం తప్పకుండా పీరియాడిక్​ రివ్యూలు కూడా ఇస్తారు. దీని ద్వారా మీ పెట్టుబడుల్లో ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలో సూచిస్తారు.

ఈ విధంగా మంచి మ్యూచువల్​ ఫండ్స్​లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా, పోర్టుఫోలియో డైవర్సిఫికేషన్​ ద్వారా మంచి కార్పస్​ను క్రియేట్​ చేసుకొని, మీకు 40 ఏళ్లు వచ్చే నాటికి కలల ఇంటిని సొంతం చేసుకోండి!

Last Updated :Jun 19, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.