ETV Bharat / business

పొదుపు ఖాతాలపై 7శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

author img

By

Published : Aug 29, 2021, 7:08 PM IST

Want highest savings account interest rate? Try these banks
పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లు.. బ్యాంకులు ఇవే!

ప్రస్తుతం వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటిది కొన్ని సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీ 7శాతం వరకు ఉంది. ఆ ఖాతాను అందిస్తున్న బ్యాంకులు ఏంటి? సరాసరి నెలవారీ కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అనేది ఓ సారి తెలుసుకుందాం.

పొదుపు ఖాతాను కలిగి ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ద్వారా నగదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందొచ్చు. అంతేకాకుండా డిపాజిట్​కు రక్షణ కూడా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ వడ్డీరేట్లు కొనసాగుతున్నప్పటికీ కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాలపై మంచి వడ్డీరేట్లను అందిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్​డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ మునుపటితో పోల్చితే తక్కువగా ఉంది. పొదుపు ఖాతాలపై అయితే 3 శాతం వద్ద ఉన్నాయి. అయితే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 7శాతం వరకు అందిస్తున్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీరేట్లను అందిస్తుంటాయి. దీర్ఘకాలం సేవలందించటం, మంచి సేవలు ఉండటం, బ్రాంచ్ నెట్​వర్క్ పెద్దగా ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకు పొదుపు ఖాతాను ఎంచుకోవాలి. ఎక్కువ వడ్డీరేటు ఉన్నట్లయితే ఇంకా మంచిది.

ఉజ్జీవన్ స్మాల్ ​ఫైనాన్స్ బ్యాంక్​

Want highest savings account interest rate? Try these banks
ఉజ్జీవన్ స్మాల్ ​ఫైనాన్స్ బ్యాంకు

ఇది స్మాల్ ఫైనాన్స్ ​బ్యాంక్​. ఆకర్షణీయ వడ్డీరేట్లను అందిస్తోంది. పొదుపు ఖాతాపై సుమారుగా 7శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది.

ఏయూ స్మాల్ ​ఫైనాన్స్​ బ్యాంక్

Want highest savings account interest rate? Try these banks
ఏయూ స్మాల్ ​ఫైనాన్స్​ బ్యాం

ఈ బ్యాంక్​ కూడా పొదుపు ఖాతాపై 7శాతం వడ్డీని ఇస్తోంది. అయితే ఈ బ్యాంక్​లోని పొదుపు ఖాతాలో నెలకు కనీస మొత్తంగా 2వేల నుంచి రూ.5వేల వరకు ఉండాలి.

ఈక్విటస్ స్మాల్ ​ఫైనాన్స్ బ్యాంక్

Want highest savings account interest rate? Try these banks
ఈక్విటస్ స్మాల్ ​ఫైనాన్స్ బ్యాంక్

ఇది కూడా సేవింగ్స్​ ఖాతాపై 7శాతం వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంక్​లోని పొదుపు ఖాతాలో నెలకు కనీస మొత్తంగా 2,500 నుంచి రూ.5వేల వరకు ఉండాలి.

సూర్యోదయ్ స్మాల్​ ఫైనాన్స్ బ్యాంక్

Want highest savings account interest rate? Try these banks
సూర్యోదయ్ స్మాల్​ ఫైనాన్స్ బ్యాంక్

ఇది పొదుపు ఖాతాపై 6.25శాతం వడ్డీని అందిస్తోంది. నెలవారీ కనీస బ్యాలెన్స్ రూ. 2వేలు అయినా ఉండాలి.

ఇదీ చూడండి: పన్ను ఆదాకు ఉత్తమ పెట్టుబడులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.