ETV Bharat / business

రూ.2,999 ఈఎంఐతో ఓలా ఈ-స్కూటర్​.. కొనేయండిలా...

author img

By

Published : Sep 15, 2021, 1:37 PM IST

దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి కంపెనీ వెబ్​సైట్​, ఓలా మొబైల్ యాప్​ ద్వారా విక్రయాలు ప్రారంభమైనట్లు ఓలా ఎలక్ట్రిక్​ ప్రకటించింది. ఈ స్కూటర్ల కొనుగోలు ప్రక్రియ, ఫినాన్స్​ సదుపాయం ఎలా ఉపయోగించుకోవాలి అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OLA S1 E-Scooter
ఎలా ఎస్​1 ఈ-స్కూటర్​

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అమ్మ‌కాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్​ సీఈఓ భవీష్​ అగర్వాల్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే రూ.499 చెల్లించి బుక్​​ చేసుకున్న క‌స్ట‌మ‌ర్‌లు మిగతా మొత్తాన్ని చెల్లించి స్కూట‌ర్‌ను సొంతం చేసుకోవచ్చు.

Ola S1 model
ఓలా ఎస్​1 మోడల్​

నిజానికి గత వారమే అమ్మకాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించి వెబ్​సైట్​ పూర్తిగా సిద్ధమవనందున.. విక్రయాలను వారం పాటు వాయిదా వేసింది ఓలా ఎలక్ట్రిక్​.

ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఈ-మెయిల్ పంపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్​ తెలిపింది. వారంతా కంపెనీ అధికారిక వెబ్​సైట్, ఓలా యాప్​ ద్వారా కొనుగోళ్లను పూర్తి చేయొచ్చని వెల్లడించింది.

Purchasing feature in Ola mobile App
ఓలా మొబైల్ యాప్​లో కొనుగోలు సదుపాయం

బుకింగ్ ఇలా..

మీరు ఇప్ప‌టికే ముంద‌స్తు బుకింగ్ చేసుకుంటే.. మీ ఫోన్ నంబర్​తో ఓలా ఎల‌క్ట్రిక్ వైబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాలనుకుంటున్న వేరియంట్​, కలర్​ను ఎంపిక చేసుకుని.. మిగతా మొత్తం చెల్లించి కొనుగోలును పూర్తి చేయొచ్చు. బుకింగ్​ సమయంలో చేసుకున్న ఎంపికలను మార్చుకునే సదుపాయం కూడా ఉంది.

Ola E-scooters in deferent colors
వివిధ రంగుల్లో ఓలా ఈ-స్కూటర్లు

కొత్తగా ఈ-స్కూటర్​ కొనాలనుకుంటే.. రూ. 499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి రిజర్వ్​ చేసుకోవ‌చ్చు.

పేమెంట్​: మీరు ఎంచుకున్న వేరియంట్‌ను బ‌ట్టి.. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రూ.2,999 ఈఎంఐ ఆప్షన్​తో.. ఫినాన్స్ సదుపాయం కూడా ఉంది. ఓలా 'ఎస్‌1 ప్రో' మోడల్​కు ఈఎంఐ 3,199 నుంచి ప్రారంభమవుతుంది.

ఫినాన్స్ సదుపాయం కోసం.. ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టాటా క్యాపిటల్​ వంటి సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఆయా సంస్థలు ఓలా, ఓలా ఎలక్ట్రిక్ యాప్​ల ద్వారా అర్హులైన కస్టమర్లకు ఎస్​1 మోడల్​ కోసం తక్షణ రుణ సదుపాయం అందిస్తాయి.

మీకు ఫినాన్సింగ్ అవ‌స‌రం లేదనకుంటే.. ఓలా ఎస్‌1 కోసం రూ. 20,000, ఓలా ఎస్‌1 ప్రో కోసం రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించ‌వ‌చ్చు. మిగతా మొత్తాన్ని షిప్మెంట్​ తేదీకి ముందు చెల్లించాలి. ఈ అడ్వాన్స్ మొత్తం రీఫండబుల్​. అయితే ఇది షిప్మెంట్ కన్నా ముందు వరకు మాత్రమే.

Hyper Charging Station
హైపర్ ఛార్జింగ్ సదుపాయం

కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. ఇక డెలివరీ కోసం వేచి చూడటమే. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. అక్టోబర్​ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. డెలివరీ సమయానికి కనీసం 72 గంటల ముందు సంబంధిత వివరాలు కస్టమర్​కు పంపిచనుంది కంపెనీ.

Ola home Charger
ఇంటి వద్దే ఛార్జింగ్ ఇలా..

ఓలా ఈ-స్కూటర్లు ఇవే..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రెండు ఈ-స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్​. ఎస్1, ఎస్1 ప్రో పేర్లతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999గా నిర్ణయించింది. అయితే విద్యుత్ వాహనాలకు రాష్ట్రాలు ఇచ్చే స‌బ్సిడీలను బ‌ట్టి ధ‌రల్లో వ్యత్యాసం ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.