ETV Bharat / sports

Ind vs Eng: టీమ్​ఇండియాలో కరోనా.. రవిశాస్త్రికి పాజిటివ్

author img

By

Published : Sep 5, 2021, 3:26 PM IST

Updated : Sep 5, 2021, 4:27 PM IST

Ravi Shastri tests positive for Covid-19
కోచ్ రవిశాస్త్రి

15:22 September 05

కోచ్ రవిశాస్త్రికి పాజిటివ్

Ravi Shastri kohli
కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి(ravi shastri corona positive) కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్​గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్​లో ఉంచారు. 

"హెడ్​ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటల్​ను.. ఐసోలేషన్​లో ఉంచాం. నిన్న సాయంత్రం చేసిన పరీక్షల్లో రవిశాస్త్రికి పాజిటివ్​గా తేలింది. అయితే RT-PCR టెస్టు కూడా చేయాల్సి ఉంది. అంతవరకు టీమ్​ఇండియాతో వీరు జట్టుతో కలవడానికి వీల్లేదు" అని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటనలో చెప్పారు. 

టీమ్​లోని ఆటగాళ్లకు కూడా శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రెండుసార్లు కరోనా పరీక్షలు చేశారు. అందులో నెగటివ్ వచ్చినవారు.. ఇంగ్లాండ్​తో నాలుగు టెస్టు నాలుగో రోజు ఆటలో పాల్గొంటారు. మూడోరోజు ఆటను 277/3తో ముగించింది టీమ్​ఇండియా. ప్రస్తుతం 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకు ఆలౌటౌంది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 290 పరుగులు చేసింది.

Last Updated : Sep 5, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.