ETV Bharat / bharat

నగ్న చిత్రాలతో యువతి మోసం- రూ.లక్షకు టోకరా

author img

By

Published : Feb 21, 2021, 12:58 PM IST

నగ్నంగా వీడియో పంపిస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడికి టోకరా వేసింది యువతి. తన మాయమాటలు నమ్మి నగ్నంగా ఉన్న వీడియోను పంపించాడు ఆ యువకుడు. అయితే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానని బెదిరించి రూ. లక్ష వసూలు చేసింది ఆమె. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Young woman says to show body parts before the wedding: Shock to Young man
పెళ్లికి ముందు అవి చూపించాలన్న యువతి

కర్ణాటకకు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి.. ఓ యువకుడిని మోసం చేసింది. అతడి నగ్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానని బెదిరించి యువకుడి నుంచి రూ. లక్ష వసూలు చేసింది. తాను మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఏం జరిగింది?

కర్ణాటక హులిమావులో ఉండే యువకుడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం జీవన్​ సాతి మ్యాట్రిమోనియల్​ వెబ్​సైట్​లో అకౌంట్​ ప్రారంభించాడు. ఆ మ్యాట్రిమోనియల్​ సైట్​లో వధువు కోసం వెతుకుతున్న యువకుడికి... ఓ యువతి పరిచయమైంది. ఇరువురు కొన్ని రోజులు బాగా మాట్లాడుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

అయితే పెళ్లికి ముందు.. యువకుడి మర్మ భాగాలను చూడాలని ఆ అమ్మాయి కోరింది. దీంతో యువకుడు ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. ఫొటోలను పంపిస్తేనే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పడం వల్ల ఆ యువకుడు.. అతని నగ్న వీడియోను ఆమెకు పంపాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానని బెదిరించి రూ. లక్ష వసూలు చేసింది ఆమె. ఇంకా డబ్బు కావాలని ఆ యువతి వేధించింది. దీంతో హులిమావు పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించాడు యువకుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి : 'ఫోన్​ నంబర్​ ఇవ్వలేదని హత్య చేశాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.