ETV Bharat / bharat

కంప్యూటర్ సెంటర్​లో మహిళపై గ్యాంగ్​రేప్.. కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..

author img

By

Published : Aug 7, 2022, 10:52 AM IST

ఉద్యోగం కోసం దరఖాస్తు ఫారాన్ని నింపేందుకు కంప్యూటర్ సెంటర్​కు వెళ్లిన మహిళపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, కన్న కూతుర్ని చంపేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చాడు ఓ తండ్రి. ఈ దారుణం యూపీలోని మేరఠ్​లో వెలుగులోకి వచ్చింది.

UP GANGRAPE
సామూహిక అత్యాచారం

కంప్యూటర్ సెంటర్​లో వివాహితపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన సమయంలో మహిళపై అకృత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో జరిగింది. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:
బాధితురాలు మే 28న అంగన్​వాడీ కార్యకర్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది. ప్రజాసేవ కేంద్రంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, షాపు యజమాని, ప్రజాసేవ కేంద్రం నిర్వాహకుడు, మరొక వ్యక్తి కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీశారు. అత్యాచారానికి పాల్పడిన వీడియోను బాధితురాలి అత్తమామలకు పంపారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు నివసించే అలీగఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తే ప్రధాన నిందితుడు. బాధితురాలు, నిందితులు కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు.

కన్నకూతుర్ని చంపేందుకు సుపారీ:
మరోవైపు, ప్రేమించిన వ్యక్తిని కలవద్దని పలుమార్లు చెప్పినా వినని కూతుర్ని చంపేందుకు కుట్ర పన్నాడు ఓ తండ్రి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది. ఆసుపత్రి వార్డ్ బాయ్​ నరేష్ కుమార్​తో కుమార్తెను హతమార్చేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు నవీన్ కుమార్.

ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు నవీన్​ కుమార్​. వార్డ్​ బాయ్ నరేష్ కుమార్​ వైద్యుడిలా నటించి బాధితురాలికి అధిక మోతాదులో పొటాషియం క్లోరైడ్​ను శరీరంలోని ఎక్కించాడు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కాగా, చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం మొత్తం బయటపడింది. శరీరంలోకి అధిక డోసు పొటాషియం క్లోరైడ్ పంపించారని వైద్యులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా.. యువతిని తన తండ్రి తొలుత తీసుకెళ్లిన ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనలో బాధితురాలి తండ్రి నవీన్, ఆసుపత్రి వార్డ్ బాయ్ నరేష్, వీరికి సాయం చేసిన ఆసుపత్రి మహిళా ఉద్యోగినిని పోలీసులు అరెస్టు చేశారు.

మద్యం మత్తులో ఉన్న తండ్రిని:
మద్యం మత్తులో తల్లి, తమ్ముడిని కొడుతున్న తండ్రిని ఇనుప రాడ్​తో కొట్టి చంపాడు ఓ కుమారుడు. ఈ ఘటన మహారాష్ట్ర.. ఠాణె జిల్లాలోని భీవండిలో జరిగింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నిందితుడు అశిష్ చౌదరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

ఇవీ చదవండి: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌.. అదే కారణమా?

పరిశోధనలతోనే పురోగమనం... ప్రణాళికాబద్ధ ప్రస్థానం తక్షణావసరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.