ETV Bharat / bharat

షాప్ షట్టర్​ను వెల్డింగ్​ మిషన్​తో కట్​ చేసిన దుండగులు.. 9కేజీల బంగారం, వజ్రాలు చోరీ!

author img

By

Published : Feb 10, 2023, 2:03 PM IST

బంగారు దుకాణ షట్టర్​ను వెల్డింగ్​ మెషిన్​తో కత్తిరించి చోరీకి పాల్పడ్డారు దుండగులు. లాకర్​ను కూడా అదే మెషిన్​తో కట్​ చేసి తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షల డైమండ్​ను దోచుకెళ్లారు. తమిళనాడులోని చెన్నైలో జరిగిందీ ఘటన.

Thieves Stolen 9 kilogram Gold in Chennai
తొమ్మిది కిలోల బంగారం చోరీ

తమిళనాడులోని చెన్నైలో దొంగలు రెచ్చిపోయారు. ఓ బంగారు దుకాణం షట్టర్​ను వెల్డింగ్​ మిషన్​తో కత్తిరించి లోపలికి చొరబడ్డారు. లాకర్​ గదిని కూడా కత్తిరించి దోపిడీకి పాల్పడ్డారు. తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షల విలువచేసే డైమండ్​ను ఎత్తుకెళ్లారు.

Thieves Stolen 9 kilogram Gold in Chennai
చోరీకి గురైన షాపు
Thieves Stolen 9 kilogram Gold in Chennai
దుండగులు వెల్డింగ్ మిషన్​తో కత్తిరించిన షాప్ షట్టర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పెరంబూర్​లోని పేపర్​ మిల్స్ రోడ్డులో శ్రీధర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శ్రీధర్​ తన రెండంతస్తుల భవనంలో రెండో అంతస్తులో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మొదటి అంతస్తులో ఎనిమిది సంవత్సరాల నుంచి జేఎల్ గోల్డ్ ప్యాలెస్ పేరుతో బంగారు నగల దుకాణాన్ని నడుపుతున్నాడు.
Thieves Stolen 9 kilogram Gold in Chennai
దుండగులు వెల్డింగ్ మిషన్​తో కత్తిరించిన లాకర్
Thieves Stolen 9 kilogram Gold in Chennai
తొమ్మిది కిలోల బంగారం చోరీ

ఎప్పటిలాగే గురువారం రాత్రి నగల దుకాణాన్నిమూసివేశాడు. అయితే శుక్రవారం ఉదయం షాప్ తెరిచేందుకు శ్రీధర్ తన షాపునకు వచ్చి చూసేసరికి షాక్​కు గురయ్యాడు. దుకాణ షట్టర్​ను గుర్తుతెలియని దుండగులు వెల్డింగు మిషన్​తో కత్తిరించి దోపిడీ చేశారు. లాకర్ గదిని తెరచి చోరీకి పాల్పడ్డారు. తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షలు విలువచేసే వజ్రాన్ని దోచుకెళ్లారు. భవనంలోని సీసీటీవీ హార్డ్​ డిస్క్​ను కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.