లిక్కర్​ మాఫియా కేసులో చిలుకను విచారించిన పోలీసులు.. సమాధానాలతో షాకిచ్చిన ప్యారెట్​!

author img

By

Published : Jan 26, 2023, 1:53 PM IST

Updated : Jan 26, 2023, 2:17 PM IST

Inspector asked parrot the address of liquor mafia

లిక్కర్​ మాఫియా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఓ చిలుకను విచారించారు!. అవునండీ మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ఆ చిలుక విచారణ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే?

లిక్కర్​ మాఫియా కేసు విచారణలో చిలుక

నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మనుషులను విచారించిన ఘటనలు చాలానే చూశాం. అయితే లిక్కర్ మాఫియా గ్యాంగ్​ను పట్టుకునేందుకు బిహార్​ పోలీసులు విచిత్రంగా ఓ చిలుకను విచారిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే?

గయాలో లిక్కర్ మాఫియా గ్యాంగ్​కు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ఓ ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లేసరికి మద్యం వ్యాపారి కుటుంబం మొత్తం అక్కడి నుంచి పరారైంది. కానీ ఆ ఇంట్లో పంజరంలో మిథూ మియాన్ అనే ఓ చిలుక ఉండిపోయింది. ఆ చిలుకకు మనుషుల భాష అర్థం అవుతోంది. దీంతో చిలుకను చూసిన ఇన్​స్పెక్టర్ కన్నయ్య దానిని విచారించటం మొదలుపెట్టారు. 'మీ సర్ అమృత్ మల్లా ఎక్కడికి వెళ్లాడు? వాళ్లు పాత్రలో మద్యం తయారు చేశారా?' అని ఇన్​స్పెక్టర్​ ప్రశ్నలు అడిగారు. చిలుక ఆయన మాటలు శ్రద్ధగా వినింది.

కానీ చిలుక మాత్రం తన యజమానికి విధేయురాలై తెలివిగా 'కటోరా'(తెలుగులో పాత్ర) అనే పదం తప్ప ఏం చెప్పడం లేదు. మంగళవారం అర్థరాత్రి రాత్రి జరిగిన ఈ చిలుక విచారణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

Last Updated :Jan 26, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.